అఫ్గానిస్థాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. అఫ్గానిస్థాన్ పశ్చిమప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేల్  పై భూకంపం తీవ్రత 5.6 నమోదైంది. భూకంపం తీవ్రతగా చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అఫ్గానిస్థాన్ పశ్చిమ ప్రావిన్స్ బ్యాజీస్ ప్రాంతంలో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. 


Also Read: Republic Day 2022: గణతంత్ర వేడుకలకు ఘనంగా వాయుసేన ఏర్పాట్లు.. 75 యుద్ధవిమానాలతో విన్యాసాలు






ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో మరణాలు సంభవించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. శిథిలాల కింద బాధితులు ఉండవచ్చని భావిస్తున్నారు. బాధితుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఖదీస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రకటించారు. 


Also Read: Covid Vaccine for Children: గుడ్‌న్యూస్.. 12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!


మూడ్రోజుల క్రితం జమ్ము కశ్మీర్ లో భూప్రకంపనలు


మూడు రోజుల క్రితం జమ్ము కశ్మీర్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. జమ్ము కశ్మీర్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించింది. అఫ్గానిస్థాన్‌లోని హిందు కుష్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో భూమి కంపించదని స్థానికులు తెలిపారు. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. పాకిస్థాన్‌లోని ఉత్తర ప్రాంతంలోనూ  5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పాకిస్తాన్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అఫ్గానిస్థాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో 100 కి.మీ లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని తెలిపింది. పెషావర్, మన్షేరా, బాలాకోట్, చర్సాడాతో సహా అనేక నగరాల్లో ప్రకంపనలు వచ్చాయి. అటు ఇండోనేషియాలోనూ భూప్రకంపనలు సంభవించాయి. 6.6 తీవ్రతతో భూమి కంపించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. 


Also Read: Omicron Cases: భారత్‌లో కాస్త శాంతించిన కరోనా మహమ్మారి.. మరోవైపు 8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి