Owaisi On RSS Chief:
ఆ వ్యాఖ్యలపై దుమారం..
ముస్లింలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముస్లింలు తమను తాము గొప్ప అనుకోవడం మానేయాలని చేసిన కామెంట్స్‌పై అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఇండియాలో ముస్లింలు జీవించడానికి మోహన్ భగవత్ పర్మిషన్ అవసరం లేదంటూ ఘాటుగా స్పందించారు. "ఇండియాలో ముస్లింలు ఉండాలా వద్దా అని డిసైడ్ చేయడానికి మోహన్ భగవత్ ఎవరు" అని
ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మేం మత విశ్వాసాలను అనుసరించాలా వద్దా అని నిర్ణయించడానికి ఆయనెవరు. అల్లా ఆశీర్వాదం మేరకు మేము భారతీయులుగా పుట్టాం. మా పౌరసత్వంపై ఆంక్షలు విధించడానికిఎంత ధైర్యం..? మా విశ్వాసాల పట్ల మేమెప్పుడూ సర్దుకుపోం"
-అసదుద్దీన్ ఒవైసీ
ముస్లింలను ఉద్దేశిస్తూ "సంఘీలు చాలా ఏళ్లుగా దేశంలోని అంతర్గత శత్రువులపై పోరాటం చేస్తున్నారు. లోకకల్యాణం కోసం పని చేస్తున్నారు. హిందుస్థాన్ ఎప్పటికీ హిందుస్థాన్‌గానే ఉంటుంది. ముస్లింలకు ఎలాంటి హానీ లేదు." అని మోహన్ భగవత్ అన్నారు. అయితే..దీన్ని ముస్లిం సంఘాలు ఖండిస్తున్నాయి.
"చైనాతో మనకు 8 ఏళ్లుగా యుద్ధ వాతావరణమే ఉంది. కానీ...ఈ స్వయంసేవక్ సర్కార్ (బీజేపీ) నిద్రపోతోంది. RSS ఐడియాలజీ భారతదేశ భవిష్యత్‌కు ప్రమాదకరం. అసలైన శత్రువులు ఎవరో ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారు. మతం పేరుతో రెచ్చగొడుతున్న ఇలాంటి విద్వేషాన్ని ఏ సమాజమూ సమ్మతించదు. హిందువులకు ప్రతినిధిగా మోహన్ భగవత్‌ను ఎవరు ఎన్నుకున్నారో తెలియదు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారా..? అలా అయితే మీకు స్వాగతం"
-అసదుద్దీన్ ఒవైసీ
మోడీపైనా విమర్శలు..
ప్రధాని మోడీపైనా విమర్శలు చేశారు ఒవైసీ. "మీ దేశంలోని ప్రజల్నే మీరు ఇలా విడదీస్తూ ప్రపంచానికి వసుధైవ కుటుంబం గురించి చెప్పకండి. వేరే దేశాలకు వెళ్లి అక్కడి ముస్లిం నేతలను ఆత్మీయంగా కౌగిలించుకుంటున్న ప్రధాని మోడీ...సొంత దేశంలోని ముస్లింలను మాత్రం ఎందుకు దగ్గరకు తీసుకోరు" అని ప్రశ్నించారు.
Also Read: Kerala Islamophobia: ముస్లింను ఉగ్రవాదిగా చూపిస్తూ స్కిట్,కేరళ స్కూల్ ఫెస్ట్‌లో రాజుకున్న వివాదం