Breaking News Live Telugu Updates: ఏమైనా సమస్య ఉంటే సర్దుబాటు చేసుకుందాం, కచ్చితంగా 175 సీట్లు గెలుద్దాం: సీఎం జగన్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 04 Jan 2023 07:13 PM
ఏమైనా సమస్య ఉంటే సర్దుబాటు చేసుకుందాం, కచ్చితంగా 175 సీట్లు గెలుద్దాం: సీఎం జగన్

అమరావతి: విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ భేటీ


సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన సీఎం.


వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్


నియోజకవర్గ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి.


ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:
– నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం:
– కార్యకర్తలను కలుసుకోవడం దీని వెనుకున్న ఉద్దేశం:
– అంతేకాకుండా మరో 14–15 నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి:
– గడపగడపకూ కార్యక్రమం ద్వారా మనం ప్రజల్లో మమేకం అవుతున్నాం:
– ఎక్కడైనా ఎవరైనా అర్హులైన వారు మిగిలిపోతే వారికి కూడా మంచి జరగాలి:
– దేవుడి దయతో మంచి పనులన్నీ చేయగలిగామని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ వివరించాలి:
– వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి:
– సచివాలయాల వారీగా కన్వీనర్లు, అలాగే ప్రతి 50 నుంచి 70 ఇళ్లకు గృహసారథులను పార్టీ నుంచి నియమింపచేస్తున్నాం:
– పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకు వెళ్తాం:
– గృహసారథుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండాలి:
– ప్రజలతో పార్టీ క్యాడర్‌ మమేకం కావాలి:
– ఏ ఒక్కరికైనా ఏ చిన్న సమస్య ఉన్నా, అర్హత ఉండి మిస్‌అయిపోతే దాన్ని పరిష్కరించి మంచి చేయాలి:
– అర్హులెవ్వరూ కూడా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఇంత ధ్యాస పెడుతున్నాం, గతంలో ఎవ్వరూ, ఎప్పుడూ ఇంత ధ్యాస పెట్టలేదు:
– సంవత్సరంలో రెండుసార్లు అలాంటి వారికి అన్నీ మంజూరు చేస్తున్నాం:
– రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88శాతం ఇళ్లకు మంచి చేశాం:
– ప్రతి అక్క, చెల్లెమ్మ పేర్లతో సహా చేసిన మంచిని పారదర్శకంగా చెప్పగలం :
– అందుకనే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పు జరుగుతోంది :
– కుప్పంలాంటి చోట్ల మున్సిపాల్టీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్నీ 80 శాతానికి పైగా క్లీన్‌ స్వీప్‌ చేయగలిగాం :


– విజయవాడ ఈస్ట్‌లో కూడా 21 వార్డుల్లో 14 చోట్ల  గెలిచాం:
– ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా మనం అధికంగా వార్డులు గెలవగలిగాం :
– మార్పు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది:
– దీనికి నిదర్శనమే కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు:
– ఏమైనా సమస్యలు ఉంటే మనంలో మనం సర్దుబాటు చేసుకుందాం:
– కచ్చితంగా 175 కి 175 సీట్లు గెలవాలి:
– అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది:
– వార్డులోకి వెళ్లినా, గ్రామంలోకి వెళ్లినా..  ప్రతి ఇంట్లోకూడా సంతోషం కనిపిస్తోంది:
– మన ప్రాంతంలో స్కూళ్లు మారుతున్నాయి, చదువులు మారుతున్నాయి, ఆస్పత్రులు మారుతున్నాయి:
– ఆర్బీకేల ద్వారా వ్యవసాయం మారుతోంది:
– ఇంత మార్పు అన్నది ఎప్పుడూ కూడా జరగలేదు:
– వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా పూర్తిస్థాయిలో వస్తుంది:
– విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో మనం తీసుకొచ్చిన మార్పులు అన్నీ కూడా పూర్తిస్థాయిలో ఫలితాలు ఇస్తాయి:
– కాబట్టి ఈ ఎన్నికలకు మనం అంతా కలిసి కట్టుగా పనిచేయాలి:
– ఎలాంటి విభేదాలున్నా పక్కనపెట్టాలి:
– ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలి:
– ఈసారి గెలిస్తే.. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం:
– 30 ఏళ్లపాటు మంచి పరిపాలన ప్రజలకు అందిస్తాం:
– నాకు ఎన్ని కష్టాలు ఉన్నాసరే.. బటన్‌ నొక్కే కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను:
– మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. ఒకరికొకరు కలిసి ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలి:
– ప్రతి ఇంటికీ వెళ్లి.. వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి:
– మనకు ఓటు వేయని వారి ఇళ్ళకు కూడా మనం వెళ్లాలి :
– చేసిన మంచిని వారికి వివరిస్తే.. కచ్చితంగా వారిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది :
– మనం వెళ్లకపోతే తప్పు చేసినట్టు అవుతుంది :
– అందుకనే ప్రతి ఇంటికీ వెళ్లాలి... అందరి ఆశీర్వాదాలు కావాలి.
మంచితనంతో మన ప్రయత్నం మనం చేయాలి:  కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన సీఎం. 
ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, వైయస్సార్సీపీ ఎన్‌టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్న మణిక్యం ఠాగూర్

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్న మణిక్యం ఠాగూర్..


ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు రాజీనామా లేక పంపిన మణిక్యం ఠాగూర్...

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీ కుదింపు

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీ కుదింపు 
ఎస్కార్ట్ వాహనంతో కలిపి 8+8 సెక్యూరిటీ తొలగింపు..  ప్రస్తుతానికి సెక్యూరిటీ కేవలం 2+2 కు కుదింపు.. 
ఇటీవల జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో బీఆర్ఎస్ లో తనకు దక్కుతున్న గౌరవంపై వ్యాఖ్యలు... 
బుధవారం నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీని విత్ డ్రా చేసిన ప్రభుత్వం...

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీ కుదింపు

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీ కుదింపు 
ఎస్కార్ట్ వాహనంతో కలిపి 8+8 సెక్యూరిటీ తొలగింపు..  ప్రస్తుతానికి సెక్యూరిటీ కేవలం 2+2 కు కుదింపు.. 
ఇటీవల జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో బీఆర్ఎస్ లో తనకు దక్కుతున్న గౌరవంపై వ్యాఖ్యలు... 
బుధవారం నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీని విత్ డ్రా చేసిన ప్రభుత్వం...

నా ప్రచార రథాన్ని తెప్పించాలి, లేదంటే ఇక్కడే ధర్నా చేస్తా: చంద్రబాబు

చిత్తూరు : కుప్పంలో పోలీసులకు చంద్రబాబు వార్నింగ్..


నేను గ్రామంలో ఇంటింటికి వెళ్లి వచ్చే సరికి సిద్దం చేయండి.. 


నా ప్రచార రథాన్ని తెప్పించాలి, లేదంటే ఇక్కడ ధర్నా చేస్తా చంద్రబాబు 


కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఇదేమి కర్మ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు 


చంద్రబాబు వెంట పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు చేరుకొని ఇంటి ఇంటికి ఇదేమి ఖర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు 


ఈ క్షణంలోనైనా ప్రచార రథం రాకపోతే పరిస్థితి మరింత ఉధృతత ఏర్పడే అవకాశం ఉంది


పోలీసులకు అర్థగంట సమయం ఇచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు 


తన ప్రచార రథాన్ని తీసుకోరావాలని కోరారు 

MLC Anantha Babu Case: అనంతబాబు కేసు సీబీఐకి అప్పగించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్సీ అనంతబాబు కేసును సీబీఐకి ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును 15 రోజుల్లో తెప్పించుకోవాలని దర్యాప్తు అధికారికి హైకోర్టు ఆదేశించింది. ఘటన సమయంలో సీసీటీవీ ఫుటేజీలో ఉన్నవారిపై కేసు పెట్టాలని ఆదేశించింది. నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలని, మూడు నెలల్లో తుది ఛార్జిషీటు దాఖలు చేయాలని గడువు విధించింది.

Telangana News: తెలంగాణ ఎమ్మెల్యేల ఎర కేసులో తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న ఆరోపణల కేసులో కొద్ది రోజుల క్రితం హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. తాజాగా ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. అప్పీలుకు వెళ్లడంతో ఈ పిటిషన్ పై విచారణను సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చేపట్టనున్నారు.

Chandrababu Kuppam Tour: కుప్పంలో ఉద్రిక్తత, చంద్రబాబు రోడ్ షోకు అనుమతి లేదన్న పోలీసులు

చంద్రబాబు రోడ్ షోకు అనుమతి లేదన్న పోలీసులు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోకు అనుమతి లేదన్నారు పోలీసులు. ఇదివరకే మైక్ పర్మిషన్ లేదని 4 ప్రచార రథాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసుల ఆంక్షలు విధించగా, ఆంక్షలను దాటుకుని టీడీపీ కార్యకర్తలు ముందుకెళ్తున్నారు. దాంతో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయగా, పలువురికి గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటన కోసం కుప్పం నుంచి శాంతిపురానికి వెళ్లాల్సిన టీడీపీ ప్రచార రథాన్ని, వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతిపురం మండలం కెనుమాకులపల్లిలో ఏర్పాటు చేసిన స్టేజ్ ను సైతం పోలీసులు తొలగించారు.

Chandrababu Kuppam Tour: టీడీపీ ప్రచార రథం, సౌండ్ వాహనాన్ని పీఎస్‌కు తరలించిన పోలీసులు

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం లో  వందల మంది పోలీసుల మోహరింపు.


జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి శాంతిపురం మండలానికి పోలీసుల తరలింపు.


ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు..


టీడీపీ ప్రచార రథం, సౌండ్ వాహనం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు


డ్రైవర్లు, సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.


పర్యటనలో సౌండ్ సిస్టమ్ కోసం అనుమతి కోరుతూ ఇప్పటికే లేఖ ఇచ్చిన టీడీపీ నేతలు


కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజి ని తొలగించిన పోలీసులు


చంద్రబాబు పర్యటించే తొలి గ్రామం తో సహా మండలం లో అన్ని చోట్ల భారీ గా పోలీసుల మోహరింపు


ప్రతి గ్రామంలో, కూడళ్ళలో పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, అదనపు బలగాలు.


మరో గంటలో బెంగుళూరు నుంచి 121- పెద్దూరు గ్రామం చేరుకోనున్న చంద్రబాబు నాయుడు

కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట

టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఏర్పాట్లకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. చంద్రబాబు పర్యటన కోసం కుప్పం నుంచి శాంతిపురానికి వెళ్లాల్సిన టీడీపీ ప్రచార రథాన్ని, వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. 

MLC Kavitha: కుమారుడు ఆర్య పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు వర్క్‌లను ఆసక్తిగా ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలపై విద్యార్థులు అద్బుతమైన ప్రాజెక్టులు రూపొందించారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తన కొడుకు ఆర్య పాఠశాలకు వెళ్ళిన ఎమ్మెల్సీ కవిత, విద్యార్థులు రూపొందించిన అనేక రకాల ప్రాజెక్ట్ వర్క్ లను ఆసక్తిగా పరిశీలించారు. పర్యావరణం, జంతు సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక అంశాలపై విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్ లను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కుమారుడు ఆర్య చేసిన ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఒక తల్లిగా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు.





Revanth Reddy: టీపీసీసీ ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ శిబిరం ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజి కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ శిబిరాన్ని జెండా ఎగరవేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనున్న శిక్షణ శిబిరం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులకు ఈ కార్యక్రమంలో ధరణి, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. విభజించి పాలించు అనే విధంగా పరిపాలన సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం రాహులు గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టి దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రజలలో చైతన్యం తీసుకువస్తున్నారని తెలిపారు. దేశ సరిహద్దులలో ఒక వైపు పాకిస్తాన్, మరొక్కవైపు చైనా అక్రమించుకుంటూ వస్తుందని, భారత ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. దేశభద్రత విషయాన్ని గాలికి వదిలేసి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన విపక్ష ప్రభుత్వాలను కూల్చే పనిలో ప్రధాని మోదీ నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఒకప్పుడు కేవలం కేవలం వార్తాపత్రికలు ఉండేవి. 24 గంటలకు ఒక్కసారి వార్తలు ప్రజలకు చేరేవి, తరువాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ప్రతి గంటకు ఒక్కసారి వార్తలు ప్రసారం అయ్యేయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది క్షణాల్లో వార్తలు ప్రజల వద్దకు వెళుతున్నాయని వివరించారు. కాబట్టి మన నాయకులు, కార్యకర్తలు కూడా అంత వేగంగా పరిస్థితులను అవగాహన చేసుకునే విధంగా తర్ఫీదు చేయాలని వెల్లడించారు.

Erragadda Metro Station: మెట్రో స్టేషన్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుంచి మారెమ్మ అనే మహిళ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ గ్రామానికి చెందిన మహిళ (70) దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృత దేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మారెమ్మ చనిపోయినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Hanamkonda News: హన్మకొండ జిల్లా కాజీపేట కడిపికొండ రాంనగర్ లో దారుణం

  • హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ రాంనగర్ లో దారుణం

  • యువతిపై దాడి చేసిన యువకుడు శ్రీనివాస్

  • యువతి అఫ్జల్ బేగంకు గొంతు వద్ద గాయం ఆసుపత్రికి తరలింపు

  • ఆగ్రహంతో శ్రీనివాస్ పై దాడి చేసిన యువతి బంధువులు

  • పోలీసుల అదుపులో యువకుడు శ్రీనివాస్

MLA Durgam Chinnaiah: టోల్ గేట్ సిబ్బంది పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ గేట్ సిబ్బంది పై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేయి చేసుకున్నారు. నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ నుండి బెల్లంపల్లికి వస్తున్న క్రమంలో టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టోల్గేట్ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలు రికార్డు అవ్వడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా టోల్ గేట్ ప్రారంభించినప్పటి నుంచి స్థానిక వాహన దారులపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా టోల్ గేట్ రుసుము కట్టినప్పటికీ రసీదులు ఇవ్వకపోవడం జరుగుతుంది. ఈ విషయంపై గత నాలుగు రోజుల క్రితం స్థానిక వాహనదారులు సైతం టోల్ గేట్ వద్ద ఆందోళన చేశారు.

IT Raids in Hyderabad: హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం, ఉదయం 4 నుంచే వేర్వేరు చోట్ల సోదాలు

హైదరాబాద్‌లోని చాలా చోట్ల నేడు తెల్లవారుజాము నుంచే ఐటీ దాడులు మొదలయ్యాయి. ఇన్‌కం ట్యాక్స్ అధికారులు 20 టీమ్‌లుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఎక్సెల్‌ గ్రూప్‌ కంపెనీకి చెందిన ఆఫీసులు, ఆ కంపెనీ యజమాని ఇళ్లలో దాడులు చేస్తున్నారు. సుమారు 60 మంది ఇన్‌కం ట్యాక్స్ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే సోదాలు మొదలైనట్లుగా తెలుస్తోంది.

Background

టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఏర్పాట్లకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. చంద్రబాబు పర్యటన కోసం కుప్పం నుంచి శాంతిపురానికి వెళ్లాల్సిన టీడీపీ ప్రచార రథాన్ని, వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. 


ఆంధ్రప్రదేశ్‌, యానాం వ్యాప్తంగా దిగువ ట్రోపోస్ఫెరిక్ లో ఈశాన్య దిశ (నార్త్ ఈస్ట్) నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే 5 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంపైకి వీస్తున్న ఈశాన్య గాలుల వల్ల రానున్న రెండు రోజులు దక్షిణ, ఉత్తర కోస్తా ఆంధ్రాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. రాయలసీమలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అందులో పేర్కొంది. 


ఏపీలోనూ రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి బాగా పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఆ జిల్లాల్లో 11 నుంచి 14 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జి.మాడుగులలో 11.6 డిగ్రీలు, వాల్మీకిపురం (అన్నమయ్య జిల్లా)లో 12.6, సోమాల (చిత్తూ­రు జిల్లా)లో 13.7, మడకశిర (శ్రీ సత్యసాయి జిల్లా)లో 13.2, ముంచంగిపుట్టు (అల్లూ­రి సీతారామరాజు జిల్లా)లో 13.1, బెలుగుప్ప (అనంతపురం జిల్లా)లో 14.9 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్ర­తలు నమో­దయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.


పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఈ మూడు జిల్లాలకు మాత్రం వచ్చే 5 రోజుల పాటు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ సాధారణంగా ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయని తెలిపారు.


రేపు ఈ మూడు జిల్లాలతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు, ఎల్లుండి అదనంగా నిజామాబాద్, జగిత్యాల, మెదక్, హైదరాబాద్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.