ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 18 మంది కోవిడ్‌ కారణంగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 13,825కి పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో కొత్తగా 1,557 కోవిడ్ కేసులు నమోదైనట్లు బులెటిన్‌లో పేర్కొంది. నిన్న 64,550 శాంపిళ్లను పరీక్షించగా ఈ మేరకు వెల్లడైనట్లు తెలిపింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20,12,123కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం చిత్తూరు (255), తూర్పు గోదావరి (232), పశ్చిమ గోదావరి (212), నెల్లూరు (164), కృష్ణా (159) జిల్లాల్లో నమోదయ్యాయి.



గత కొద్ది రోజులుగా నమోదవుతోన్న కోవిడ్ పాజిటివ్ కేసుల్లో అత్యధికం ఈ ఐదు జిల్లాల నుంచే నమోదవుతున్నాయి. ఇక కోవిడ్ బాధితుల్లో గత 24 గంటల్లో 1,213 కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 19,83,119కి చేరింది. ప్రస్తుతం 15,179 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న మరణించిన వారిలో కృష్ణా జిల్లాలో నలుగురు.. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరిలో ఒకరు ఉన్నారు.  
దేశంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి..
దేశంలో గత కొద్ది రోజుల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 45,083 మంది కోవిడ్ బారిన పడ్డారు. వీటిలో కేరళ నుంచే 70 నుంచి 75 శాతం కేసులు ఉన్నాయి. మరో 460 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ కన్నుమూశారు. రికవరీ రేటు మాత్రం 97 శాతానికి పైగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్క రోజులో 35,840 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారని తెలిపింది.


Also Read: Vaccination Duping: వ్యాక్సిన్ వేసుకుంటే బ్యాంక్ ఖాతాల్లో నగదు... మోసానికి తెర లేపిన సైబర్ నేరగాళ్లు.. ఇద్దరు అరెస్టు


Also Read: Andhra Pradesh Highway: ఏపీలో కొత్తగా 20 జాతీయ రహదారులు... కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ రహదారులివే!