ప్రపంచమంతా ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గుచూపుతుంటే ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ మాత్రం సరికొత్త టెక్నాలజీలపై దృష్టి సారించింది. ఇప్పటికే ఫ్లైయింగ్ కార్ టెక్నాలజీ మీద విస్త్రృత పరిశోధనలు జరుపుతోన్న కంపెనీ.. త్వరలోనే మరో కొత్త టెక్నాలజీతో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. హైడ్రోజన్ ఆధారంగా నడిచే కార్లను త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హైడ్రోజన్ వేవ్ కారుకు సంబంధించిన టీజర్ విడుదల చేసింది. టీజర్ వీడియోలో కారు ట్రాక్ చుట్లూ తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఇదో స్పోర్ట్స్ కారులా జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. కారుపై నల్లని గీతలతో పెయింటింగ్ వేసి ఉంది. ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాలను సెప్టెంబర్ 7వ తేదీన వెల్లడించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే హైడ్రోజన్ ఆధారితంగా నడిచే కార్లలో ఇంజిన్ల పనితీరు కాస్త సంక్లిష్టంగానే ఉండనుంది. ఈవీలలో వాడే లిథియం అయాన్ బ్యాటరీల కంటే ఇది కాస్త తేలికగా ఉంటుంది. ఈ కారుకి రెండు డోర్స్ ఉన్నాయా లేదా నాలుగా? అనే విషయంపై కూడా స్పష్టత రాలేదు. హ్యుందాయ్ (కియా లేదా జెనెసిస్) పోర్ట్‌ఫోలియోలో దేనితోనూ ఇది సరిపోలడం లేదు. మరో వీడియోలో హ్యుందాయ్ హైడ్రోజన్ ప్యూయల్ సెల్ ట్రక్కుల గ్లింసెస్ చూపించారు.
పర్యావరణాన్ని కాపాడటంలో హైడ్రోజన్ కార్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని కంపెనీ చెబుతోంది. వీటిలో డీకార్బోనైజేషన్ కూడా సులువని తెలిపింది. సాధారణ వాహనాల నుంచి కార్బన్ ఉద్గారాలు వెలువడతాయి. వీటి వల్ల పర్యావరణం కలుషితం అవుతుంది. హైడ్రోజన్ కార్ల నుంచి వెలువడే వాయువు గ్రీన్ హౌన్ ఎఫెక్టును కూడా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ హైడ్రోజన్ వాహనాన్ని పూర్తిగా చార్జ్ చేస్తే 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. సీఎన్‌జీ (CNG) వాహనాల మాదిరిగానే వీటిలోనూ ఇంధనాన్ని ట్యాంకుల్లో నింపుకోవచ్చు. ఈ ఇందనాన్ని కేవలం 5 నిమిషాల్లోనే నింపుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
Also Read: Mahindra Bolero Neo: మహీంద్రా బొలెరో నియోలో న్యూ వేరియంట్.. కొత్త పీచర్ ఏంటంటే?