విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఒప్పంద ప్రాతిపదికన ఆప్కాబ్ శాఖల్లో బ్రాండ్ మేనేజర్/ అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సీఏఐఐబీ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబర్ 7లోపు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకొని, దరఖాస్తు నింపిన తర్వాత  నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. 


వివరాలు..


* బ్రాండ్ మేనేజర్/ అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్: 01


కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది.


అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సీఏఐఐబీ ఉత్తీర్ణత. 


అనుభవం: బ్యాంకింగ్ రంగంలో 12 సంవత్సరాల పని అనుభవం ఉండాలి


వయోపరిమితి: 01.11.2022 నాటికి 40 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. 


దరఖాస్తు ఫీజు: రూ.1000. 'THE ANDHRA PRADESH STATE COOPERATIVE BANK LTD' పేరిట చెల్లుబాటు అయ్యేలా రూ.1000 డిడి తీయాలి. లేదా అకౌంట్ నెంబరు: 610000006843, అకౌంట్ పేరు: APCOB-HRMD, IFSC: APBL0000126 ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తుకు డిడి/ ఫీజు చెల్లింపు రసీదు జతచేసి సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. 


ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వూ నిర్వహిస్తారు.


జీతం: నెలకు రూ.75,000.


దరఖాస్తులకు చివరి తేదీ: 07.11.2022.


దరఖాస్తులు పంపాల్సి చిరునామా: 
The Managing Director, 
The A.P. State Cooperative Bank Ltd, 
NTR Sahakara Bhavan, 
D. No. 27-29-28, Governorpet,
Vijayawada-520002


Notification


Application


Website


Also Read


ఐఎండీ సైంటిఫిక్ అసిస్టెంట్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
భారత వాతావరణ శాఖలో 990 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 18 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబరు 25న దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్ష తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా వెల్లడించింది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సీజీఎల్-2022 'టైర్-1' పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవలే  కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్(SSC CGL)-2022 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు 19, 20 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 1 నుండి 13 సీజీఎల్ 'టైర్-1' పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డ్ విడుదలకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే నవంబరు మూడోవారం నుంచి అడ్మిట్ కార్డులు జారీచేసే అవకాశం ఉంది.
నోటిఫికేషన్, పరీక్ష తేదీ వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...