Telangana News | పోలవరం నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ - ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు
పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులతో జరిపిన చర్చల ఫలితంగా.. పెండింగ్ నిధులతో పాటు రూ. 12500 కోట్లను విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2014 -19 మధ్య పరుగులు పెట్టిన  పోలవరం ప్రాజెక్టు తర్వాత ఆగిపోయింది. ఐదేళ్ల సమయం వృధా అయింది. రివర్స్ టెండర్లకు వెళ్లి కాంట్రాక్టర్లను మార్చడంతో పనులు ఆగిపోయాయి. గైడ్  బండ్ కుంగిపోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


టీడీపీలోకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ- వైసీపీకి బిగ్‌షాక్!
వైసీపీకి రోజు రోజుకు సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు సైలెంట్‌గా ఉండిపోతే... మరికొందరు రాజకీయాల నుంచే తప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొందరు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే మంత్రిగా పని చేసిన ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే బాట పడుతున్నారు. ఇప్పటి వరకు రాజీనామా చేసిన వాళ్లంతా మాజీలే. ఇప్పుడు మాత్రం ఎంపీగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజీనామాకు సిద్ధపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌ ఎప్పుడు రానున్నారు? షెడ్యూల్ ఏంటీ?
ఢిల్లీ లిక్క‌ర్ కేసులో ఈ రోజు (బుధవారం) విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు ఎమ్మెల్సీ క‌విత‌. సీబీఐ దాఖ‌లు చేసిన ఛార్జ్‌షీట్ ట్ర‌య‌ల్స్‌లో భాగంగా ఆమె వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ‌కు హాజ‌ర‌వుతారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో నిన్న మంగ‌ళ‌వారం తీహార్ జైలు నుంచి విడుద‌లైన కేసీఆర్ త‌న‌య వ‌సంత్ విహార్‌లోని పార్టీ కార్యాల‌యంలో బ‌స చేశారు. వీడియో కాన్ఫ‌రెన్స్ లో విచార‌ణ పూర్తికాగానే మ‌ధ్యాహ్నం 2.40 గంట‌ల‌కు త‌న కుటుంబ స‌భ్యులు, పార్టీ నాయ‌కులతో క‌లిసి హైద‌రాబాద్ బ‌య‌ల్దేరి వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో జరిగే లిక్కర్ పాలసీ సీబీఐ కేసు చార్జ్ షీట్ పై విచారణకు వర్చువల్ గా హాజరుకానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ
తెలంగాణ సచివాలయంలో డిసెంబర్‌ 9 నాటికి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ భూమి పూజ నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రక్రియ చేపట్టారు. వేదమంత్రాలుగా సాక్షింగా 11 గంటలకు రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారులు పలుమార్లు చర్చించి సచివాలయంలో పోర్టికోకు ఎదురుగా విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 22ఏ, ప్రీహోల్డ్ భూములపై రీ సర్వే చేయాలని, సర్వే రాళ్లపై ఉన్న జగన్ బొమ్ముల తొలగించాలని తీర్మానించింది. సెబ్‌ రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించాలని తేల్చింది.  రివర్స్ టెండరింగ్ విధానానికి ముగింపు పలికింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి