Anti Hijab Row: ఇరాన్ మహిళల ఆందోళనలకు మద్దతుగా బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా తన జుట్టు కత్తిరించుకుంది. జుట్టు కత్తిరించుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
సెప్టెంబర్‌లో మాషా అమిని అనే ఇరాన్ మహిళ పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయింది. తన కేశాలను కొద్దిగా చూపించినందుకు.. కఠినమైన దుస్తుల నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు పోలీసులు ఆమెను చంపేశారని వార్తలు వచ్చాయి. దీంతో దేశం మొత్తం భగ్గుమంది. నిరసన జ్వాలలతో అట్టుడుకిపోయింది.
బాలికలు, మహిళలు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లను తీసేసి ఆందోళనలకు దిగారు. మాషా అమిని హత్యకు నిరసనగా తమ జుట్లు కత్తించుకున్నారు. ఈ ఆందోళనలను అణిచేందుకు ప్రభుత్వం చేయించిన పోలీస్ దాడుల్లో ఇప్పటివరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రెటీలు కూడా ఇరాన్ మహిళలకు మద్దతుగా జుట్టు కత్తిరించుకుంటున్నారు. ఊర్వశి రౌతేలా కూడా జుట్టు కత్తిరించుకుని మద్దతు తెలిపింది. తాము ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా బతకాలో అనేది ఎవరో నిర్ణయించాల్సిన అవసరం లేదనే సందేశం తమ నిరసనల్లో ఉందని పేర్కొంది.
Also Read: Delhi Excise Policy Case: ఫేక్ కేసులో నన్ను అరెస్ట్ చేయబోతున్నారు: దిల్లీ డిప్యూటీ సీఎం