హీరో నాని నటిస్తున్న తాదజాగా సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. `శ్యామ్ సింగరాయ్` మూవీతో సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నాని, `అంటే సుందరానికి` చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో `దసరా` మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని గతంలో ఎప్పుడు కనిపించని రీతిలో.. ఊర మాస్ గా దర్శనం ఇవ్వబోతున్నాడు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అనే మాస్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.


ఆకట్టుకుంటున్న కీర్తి ఫస్ట్ లుక్


ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా అందాల తార  కీర్తి సురేష్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి  కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఆమె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి వెన్నెల అనే పాత్రలో నటిస్తోంది. ‘హ్యాపీ బర్త్ డే టు అవర్ వెన్నెల’ అంటూ ఈ పోస్టర్ మీద రాశారు. “వెన్నెల అనేది పేరు మాత్రమే కాదు. ఒక ఎమోషన్. మా చిత్తు చిత్తుల బొమ్మ కీర్తి సురేష్ కి జన్మదిన శుభాకాంక్షలు” అని హీరో నాని ట్వీట్ చేశాడు.  పసుపు పచ్చ చీర కట్టుకుని పెళ్లి కూతురుగా డ్యాన్స్ చేస్తున్నట్లు ఈ పోస్టర్ లో  దర్శనం ఇచ్చింది కీర్తి. ఓ మధ్య తరగతి అమ్మాయి మాదిరిగా చేతులకు గాజులతో, నుదిటిన బాసింగం కట్టుకుని, మల్లెపూల జడను ధరించి ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.






దుమ్మురేపుతున్న ‘దసరా’ బిజినెస్


నాని న‌టిస్తున్న తొలి పాన్ ఇండియ‌న్ సినిమా ‘దసరా’.  తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా 2023 మార్చి 30 రిలీజ్ చేయ‌బోతున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ నేపథ్యంలో  `దసరా` సినిమాకు ఓ రేంజిలో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తున్నది.  ఇప్ప‌టికే ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ హక్కులను ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజార్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా  రూ. 30  కోట్లు చెల్లించింది. ఇతర భాషలకు చెందిన రైట్స్ రూ.10 కోట్లకు అమ్ముడయ్యాయట. అటు శాటిలైట్ రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే  నాన్ థియేట్రికల్  హక్కులకే ఈ సినిమా రూ.60 కోట్లు రాబ‌ట్టింది. ఇక దసరా థియేట్రికల్ రైట్స్ రూ.40 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తున్నది. మొత్తంగా ద‌స‌రా సినిమా  రూ.100 కోట్ల బిజినెస్ చేసినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతున్నది. ఇది వాస్తవం అయితే నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా ‘దసరా’ నిలుస్తుంది.


Also Read: ఈ సిరీస్ చూస్తే గజగజ వణకాల్సిందే! ఎక్కువగా ఉలిక్కిపడే సీన్లతో ‘ది మిడ్ నైట్ క్లబ్’ గిన్నిస్ రికార్డు!