గిన్నిస్ రికార్డు సాధించిన ‘ది మిడ్నైట్ క్లబ్’ ఫస్ట్ ఎపిసోడ్


తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘నెట్‌ ఫ్లిక్స్’ లో ‘ది మిడ్‌నైట్ క్లబ్’ అనే హార్రర్ సిరీస్ ప్రసారం అయ్యింది. మైక్ ఫ్లానాగన్ తెరకెక్కించిన ఈ సిరీస్ తొలి ఎపిసోడ్ ఏకంగా ప్రపంచ రికార్డును సాధించింది.  ఎక్కువ భయపడే సీన్లు ఉన్న సిరీస్ గా గుర్తింపు తెచ్చుకుంది. గత శుక్రవారం (అక్టోబర్ 7) 10-ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యింది. ఇదే సమయంలో, దాని తొలి ఎపిసోడ్ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ‘ది ఫైనల్ చాప్టర్’ పేరుతో ప్రసారం అయిన ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కువ ఉలిక్కిపడే సీన్లు ఉన్న సింగిల్ టెలివిజన్ ఎపిసోడ్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.






ఫ్లానాగన్ నేతృత్వంలో ఇప్పటికే పలు నెట్ ఫ్లిక్స్ సిరీస్ లు రూపొందాయి. వాటిలో ‘ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్’ ముఖ్యమైనది.  దాని ఫాలో అప్ గా ‘ది హాంటింగ్ ఆఫ్ బ్లై మనోర్’ ను రూపొందించారు.  2021లో ‘మిడ్‌నైట్ మాస్’ను తెరకెక్కించారు. అటు స్టీఫెన్ కింగ్ కు సంబంధించిన ‘ది షైనింగ్‌’ను  ఫ్లానాగన్ ‘డాక్టర్ స్లీప్ పేరుతో రూపొందించారు. ఈ సిరీస్ లు నెట్ ఫ్లిక్ కు అద్భుత గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన దర్శకత్వంలోనే తాజాగా ‘ది మిడ్‌నైట్ క్లబ్’ సిరీస్ రూపొందింది. తొలి ఎపిసోడే కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చుకుంది.


అనుకున్నట్టుగానే అద్భుతంగా భయపెట్టా!


అటు ‘ది ఫైనల్ చాప్టర్’ ప్రపంచ రికార్డు సాధించడం పట్ల ఫ్లానాగన్ సంతోషం వ్యక్తం చేశారు. “ఈ సిరీస్ లో గతంలో నేను చేసిన సిరీస్ ల కంటే ఎక్కువ హర్రర్ సీన్లను పెట్టాలి అనుకున్నా. మిగతా వాటికి దీనికి పోలికే లేకుండా చూడాలి అనుకున్నాను. అనుకున్నట్లుగానే మరింత అద్భుతంగా భయపెట్టగలిగాను. ఇప్పుడు, జంప్ స్కేర్స్ కు సంబంధించి  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నా పేరు ఉంది” అని వెల్లడించారు.  


Read Also: ఇలాంటి వారిని నా పక్కన పెట్టొద్దు, అనిల్ రావిపూడిపై స్నేహా కామెంట్!


క్రిస్టోఫర్ పైక్ పుస్తకం ఆధారంగా తెరెక్కిన ‘మిడ్నైట్ క్లబ్’


క్రిస్టోఫర్ పైక్ రాసిన ప్రసిద్ధ బుక్ సిరీస్ మీద ఆధారపడి ‘మిడ్‌నైట్ క్లబ్’ రూపొందింది. కొంత మంది టీనేజర్స్ రాత్రి పూట ఒక్కచోటుకు చేరి భయంకరమైన కథలు చెప్పుకుంటారు. ఒక క్లబ్ ఏర్పాటు చేసుకుని అందరూ అక్కడ కలుసుకుంటారు. రోజు ఒకరు కథ చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు,   మరణానంతర జీవితం ఉంటే, ఇతరులకు చెప్పడానికి మొదట చనిపోయే వ్యక్తి తిరిగి రావడానికి ప్రయత్నిస్తారని వారు భావించేవారు. భయంకరమైన కథల గురించి ఈ టీనేజర్స్ చర్చించుకుంటారు. చివరకు అవన్నీ కేవలం ఊహలుగానే ముగుస్తాయి. 


ఇంతకీ జంప్ స్కేర్ అంటే ఏంటి?   


అకస్మాత్తుగా స్క్రీన్‌పై ఏదో కనిపించి మిమ్మల్ని షాక్ కు గురి చేసేవే జంప్ స్కేర్స్.  అవి సాధారణంగా నిశ్శబ్దంగా ఉంటూనే, ఆకస్మికంగా  అనూహ్యమైన సౌండ్ ఎఫెక్ట్‌ తో భయపెడతాయి. ఒక్కోసారి భయంతో సీట్ల నుంచి కిందపడేలా చేస్తాయి. 1942లో విడుదలైన ‘క్యాట్ పీపుల్’, 1960లో ఆల్‌ఫ్రెడ్ హిచ్‌ కాక్ తెరకెక్కించిన ‘సైకో’,  1975లో విడుదలైన  స్టీవెన్ స్పీల్‌బర్గ్  ‘జాస్’, 1990లో వచ్చిన ‘ది ఎక్సార్సిస్ట్’  1995లో విడుదలైన ‘Se7en’ సినిమాలు అత్యంత భయపెట్టే సినిమాలుగా నిలిచాయి. తాజాగా వీటన్నింటి రికార్డులన బద్దలు కొట్టింది‘మిడ్‌నైట్ క్లబ్’ ‘ది ఫైనల్ చాప్టర్’ ఎపిసోడ్.   


Read Also: బాలీవుడ్ లోకి టీమిండియా గబ్బర్ సింగ్ ఎంట్రీ, హ్యూమాతో శిఖర్‌ డ్యాన్స్‌!