Girl Suicide In: తమిళనాడులో విద్యార్థినులు వరుస ఆత్మహత్యలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా కడలూరు జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.
నాలుగు పేజీలు
బాధితురాలి నుంచి నాలుగు పేజీల సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేశారు. అందులో తాను ఐఏఎస్ కావాలన్న తల్లిదండ్రులు కోరికను నెరవేర్చలేకపోతున్నాని ఆ విద్యార్థిని రాసింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
2 వారాల్లో
జులై 13న కల్లకురిచ్చి జిల్లాలో 17 ఏళ్ల విద్యార్థిని హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఆ విద్యార్థిని బంధువులు, స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. స్కూల్‌పై దాడిచేశారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. దీంతో విద్యా సంస్థల్లో జరగుతున్న మరణాలపై సెంట్రల్ బ్యూరో సీఐడీతో విచారణ జరిపించాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తిరువళ్లూరులోని ప్రభుత్వ పాఠశాల హాస్టల్ గదిలో సోమవారం మరో 12వ తరగతి విద్యార్థిని ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది. ఇక ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే తాజాగా మంగళవారం ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రెండు వారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి.
సీఎం విజ్ఞప్తి
రాష్ట్రంలో విద్యార్ధినిల ఆత్మహత్యలపై సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యకు పాల్పడవద్దని సీఎం కోరారు.
Also Read: Lakhimpur Violence Case: ఆశిష్ మిశ్రాకు బెయిల్ నిరాకరణ- లఖింపుర్ ఖేరీ కేసు అప్‌డేట్