AP Telangana News Today on 5 November 2024 - పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఇతర కేసులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ కాకా రేపుతున్నాయి. దీనిపై హోంమంత్రి, డీజీపీ వివరణ ఇచ్చుకుంటే... వైసీపీ మాత్రం విమర్శల వాడి పెంచింది. ఇది కచ్చితంగా అటు పవన్ కల్యాణ్‌ను, ఇటు కూటమి ప్రభుత్వంపై ఘాటుగా వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడా ఎవర్నీ తప్పుపడుతూ మాట్లాడలేదని... వ్యవస్థలో ఉన్న లోపలను ఎత్తి చూపారని కామెంట్ చేశారు హోంమంత్రి అనిత. పూర్తి వివరాలు
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు అమలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు అమలు చేయబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో ఎత్తు. ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందుకే నిబంధనల్లో కాస్త సడలింపులు ఇస్తోంది. రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్న మంత్రి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో మాట్లాడిన గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ గుడ్ న్యూస్ చెప్పారు. పూర్తి వివరాలు
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
తెలంగాణ రాజకీయాల్లో కులగణన గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేసీఆర్ నిర్వహించిన సకలజనుల సర్వే కన్నా భిన్నంగా ఈ కులగణన చేపట్టబోతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఈ గణన చేపడతారు. పూర్తి వివరాలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
వైఎస్ జగన్ , షర్మిల మధ్య ఆస్తుల వివాదానికి కారణం అయిన సరస్వతి పవర్ భూములను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. గురజాల నియోజకవర్గంలోని వేమవరం వద్ద ఉన్న భూముల్ని పరిశీలించిన తర్వాత అక్కడ మాట్లాడారు. భూముల ఇచ్చేది లేదని చెప్పిన రైతుల మీద పెట్రోల్ బాంబులతో దాడి చేసి మరీ భూముల్ని లాక్కున్నారని ఆరోపించారు. ఇన్నేళ్లయినా ఇంకా రైతులకు పరిహారం అందలేదన్నారు. పూర్తి వివరాలు
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి సుధీర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి సుధీర్ ను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు. పూర్తి వివరాలు