Kuppam Municipal Chairman Sudhir joined TDP:  కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి సుధీర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి సుధీర్ ను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని సుధీర్ తెలిపారు.                           

  


సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు


మున్సిపల్ ఎన్నికల సమయంలో కుప్పంలో వైసీపీ అత్యధిక వార్డుల్లో గెలిచిం ది. ఓట్లు గల్లంతు చేసి కేవలం వైసీపీ ఓటర్లను మాత్రమే బూత్‌లలోకి వచ్చేలా చేసి విజయం సాధించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అప్పట్లో పోలీసులు కూడా వారికి సహకరించారనని మండిపడ్డారు. ఆ సమయంలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత ఆయనతో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ స్థానిక టీడీపీ క్యాడర్ వ్యతిరేకిచడంతో ఆగిపోయింది. గతంలో టీడీపీలో చేరేందుకు సుధీర్ తన అనుచరులతో కలిసి విజయవాడ వచ్చిన సమయంలో కుప్పంలోని ఆయన ఆస్పత్రిపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. దాంతో చేరికలు ఆగిపోయాయి.               


రెండు నెలల తర్వాత  కుప్పంలోని పార్టీ క్యాడర్ ను బుజ్జగించి మళ్లీ పార్టీలో చేర్చుకున్నట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసి చేరిపోయారు. ఇది వేరే టీడీపీ కౌన్సిలర్‌కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో వైసీపీకి చెందిన ముఖ్య నేతలంతా కనిపించకుండా పోయారు. కుప్పం ఇంచార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ భరత్ పూర్తిగా హైదరాబాద్ పరిమితం అయ్యారు. వైసీపీ ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు పర్యటనలో అలజడి రేపిన వారు, రాళ్ల దాడులకు పాల్పడిన వారు అంతా  పరారయ్యారు. దీంతో వైసీపీ క్యాడర్ తలో దిక్కుకు వెళ్లిపోయారు.                              



Also Read: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?