Telangana News Today | చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
తెలుగు రాష్ట్రాలు విభజన జరిగి పదేళ్లు దాటినా ఇప్పటికీ ఉమ్మడి సమస్యలు పరిష్కారం కాలేదు. గతంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం... ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా చొరవ చూపకపోవడం వల్ల దశాబ్దకాలంగా సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే వీటికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలన్న ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) ఒక అడుగు ముందుకేసీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి లేఖ రాయడం...ఆయన వెంటనే అంగీకరించడంతో ఈ సమస్యలకు ఇప్పటికైనా పరిష్కారం లభిస్తుందేమో చూద్దాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాంగ్రెస్‌లోకి రాజ్యసభ ఎంపీ కేకే - వెంటనే పదవికి రాజీనామా చేసే అవకాశం
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన .. మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతారు. అంతకు ముందే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే పార్టీ మారితే అనర్హతా వేటు పడుతుంది. అందుకే రాజీనామా చేయాలనుకుంటున్నారు. 2020లో బీఆర్ఎస్ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీ భవిష్యత్ లోకేష్- మొదటి స్పీచ్‌తో లోక్‌సభలో అదరగొట్టిన టీడీపీ ఎంపీ శబరి
మొదటి స్పీచ్‌లోనే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి టాక్ ఆఫ్‌ద లోక్‌సభ అయిపోయారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో హాట్ హాట్ చర్చలు నడిచాయి. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం శబరికి టీడీపీ తరఫున వచ్చింది. ప్రతిపక్షం నినాదాల మధ్యే ఆమె స్పీచ్ కొనసాగించారు. మొదటిసారి మాట్లాడుతున్నామనే భావన లేకుండా చాలా నిర్భయంగా ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జెండా ఊపుతున్న చిన్నారిని చూసి ఆగిపోయిన పవన్- జనసైనికులు స్టాటస్ పెట్టుకునే వీడియో
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పవన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఓ బాలుడు రోడ్డుపక్కనే జెండా ఊపుతూ కనిపించాడు. ఆ బాలుడిని చూసిన పవన్ కల్యాణ్ వెంటనే కారు ఆపేసి దిగారు. బాలుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. పవన్ ఆ బాలుడిని పట్టుకుంటున్న టైంలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మండలాలు వద్దు 5 గ్రామాలు చాలు - ఏపీ ప్రభుత్వంతో బేరానికి రేవంత రెడ్డి రెడీ ! ఎందుకంటే ?
ఆరో తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. వభజన సమస్యల పరిష్కారమే ఎజెండా. ఈ సమావేశం జరగడం మంచి పరిణామమేనని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రకటించారు. అయితే ఇక్కడో కీలక డిమాండ్ చేశారు. అదేమిటంటే.. విభజన సమయంలో ఏపీలో కలిపిన ఏడు మండలాల్ని మళ్లీ తెలంగాణలో కలిపేలా రేవంత్ డిమాండ్ చేయాలని ఆయన అంటున్నారు. అవన్నీ పోలవరం ముంపు మండలాలు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి