Breaking News Live Telugu Updates: ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం: వైఎస్‌ఆర్‌సీపీ

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు

ABP Desam Last Updated: 14 Sep 2023 01:58 PM
ప్యాకేజ్ బంధం బయటపడింది- టీడీపీ, జనసేన పొత్తుపై వైఎస్‌ఆర్‌సీపీ సెటైర్లు

 


పవన్ కల్యాణ్‌ రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌కి వెళ్ళింది టీడీపీతో పొత్తును ఖాయం చేసుకునేందుక‌ని ప్రజలకు అర్ధమైందని విమర్శించింది వైసీపీ. ఇన్నాళ్ళూ నమ్మకం పెట్టుకున్న అభిమానలుకు, జనసేన కార్యకర్తలకు అన్యాయం చేసి భ్రమలు తొలిగించారని ఆరోపించింది. ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధమని ఆ పార్టీ ట్వీట్ చేసింది. ఇక మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి వీళ్లను తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడింది. 

ఇవాళ చాలా కీలకమైన భేటీ: పవన్

అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్ర సర్వనాశనం అవుతుంది. ప్రతి వీధిలో ఘర్షణలు కనిపిస్తాయి. మా నాయకులు నిరసన తెలిపినందుకు హత్యానేరం మోపారు. చంద్రబాబుపై మోపిన నేరం కూడా రాజకీయ కక్ష. దీన్ని సంపూర్ణంగా ఖండిస్తున్నాం. ఇవాళ్టి భేటీ చాలా కీలకమైంది. 

సీఎం జగన్ రాజ్యాంగ ఉల్లంఘనులకు పాల్పడుతున్నారు: పవన్ కల్యాణ్

దేశం బయటకు వెళ్లాలంటే ఈ నేరస్తుడు కోర్టు పరిమిషన్ తీసుకోవాలి. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారు. దేశ చట్టాలను కూడా ఖాతరు చేయడం లేదు. అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాలంటీర్‌తో డేటా చౌర్యం చేస్తూ చట్టాలు ఉల్లంఘిస్తున్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పోనీ రాష్ట్రంలో అభివృద్ధి మైనా ఉందా.. ఇచ్చిన హామీలు ఏమైనా నలిబెట్టుకున్నారు. సీపీఎస్ రద్దు చేస్తానన్న వ్యక్తి చేశాడా. లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వ్యక్తి ఉద్యోగాలు ఇచ్చారా. లిక్కర్‌లో అడ్డగోలుగా దోస్తున్నారు. లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి కూడా బాగాలేదు. ప్రజాస్వామ్యంలో ఒక అభిప్రాయం చెప్తే దాన్ని ప్రతిఘటించకూడదంటే ఎలా... నా లాంటి వాడిని రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేస్తామంటే ఎలా... రోడ్డుపై తిరగకూడదు.. ఎవరూ చేతులు చూపకూడదు.. బండిలో  ఉండి బయటకు రాకూడదు అంటే ఎలా.. 

బ్యాంకు సిబ్బంది తప్పు చేస్తే బ్యాంకు మేనేజర్‌ను తప్పుబడతామా: పవన్

బ్యాంకులో సిబ్బంది చేసిన తప్పునకు బ్యాంకు మేనేజర్‌ని తప్పుబడుతామా? ప్రతి విషయాన్ని సీఎంకి లిక్ చేస్తామా. గతంలో దీన్ని గుజరాత్‌ లాంటి రాష్ట్రంలో కూడా అమలు చేశారు. సైబరాబాద్‌ సంపూర్ణమైన సిటీ నిర్మించిన వ్యక్తికి 300 కోట్ల రూపాయల స్కామ్‌ను చుట్టి ఇలా జైల్లో పెట్టడం బాధకలిగించింది. తీవ్రమైన నేరాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇతరులపై నేరాలు మోపుతూ జైల్లో పెడుతున్నారు. 

నేను తీసుకునే నిర్ణయాలు చాలా మందికి బాధ కలిగిస్తాయి: పవన్

నేను తీసుకునే నిర్ణయాలు చాలా మందికి బాధ కలిగిస్తాయి. 2014లో కూడా ఇలాంటివి విన్నాను. దేశానికి బలమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే మోదీకి అప్పట్లో మద్దతు తెలిపాను.  2019లో పాలసీ విధానంతోనే చంద్రబాబుతో విభేదించాను. నేను ఓ నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడను. 

ఏపీలో అరాచక పాలనలో భాగంగానే ఈ అరెస్టు : పవన్ కల్యాణ్

చంద్రబాబుకు సంఘీభావం చెప్పేందుకే వచ్చాను
ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది. 
అందులో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారు. 

కాసేపట్లో రాజమండ్రి జైలుకు పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన చంద్రబాబు ఫ్యామిలీని కలవబోతున్నారు. వారికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి లోకేష్, బాలకృష్ణతో కలిసి సెంట్రల్ జైల్‌లో ఉన్న చంద్రబాబును కలవబోతున్నారు. 

జాహ్నవికి న్యాయం జరగాలి: మంత్రి కేటీఆర్

అమెరికాలో మృతి చెందిన జాహ్నవి ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. దీనిపై అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, విదేశాంగ వ్యవహాాల మంత్రి జయశంకర్ రియాక్ట్ అవ్వాలని రిక్వస్ట్ చేశారు. 

Background

Breaking News: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమవేశం అయ్యేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ నేడు (గురువారం) రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు- ఈ ముగ్గురు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. దాంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. గురువారం ఉదయం 10 గంటలకు పవన్, బాలకృష్ణ రాజమండ్రికి చేరుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదివరకే తొలి దఫా ములాఖత్ లో సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణిలు చంద్రబాబును కలిసి మాట్లాడుకున్నారు. న్యాయం గెలుస్తుందని, త్వరలో తాను జైలు నుంచి బయటకు వస్తానని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పడం తెలిసిందే.


చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని.. కుట్ర పూరితంగా ఈ చర్యలు తీసుకున్నారని పవన్ కల్యాణ్ అంటున్నారు. చంద్రబాబుకు గట్టిగా మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుతో భేటీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తూండటం రాజకీయంగానూ ఆసక్తికరంగా మారింది. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున పవన్ కల్యాణ్ .. ప్రభుత్వం కుట్ర పూరిత అరెస్టును ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. అదే  రోజు ఆయన విజయవాడ రావాల్సి ఉండగా ఆయన విమానానికి అనుమతించవద్దని పోలీసులు ఎయిర్ పోర్టుకు లేఖ రాశారు. దాంతో ఆయన ఫ్లైట్‌లో విజయవాడ రాలేకపోయారు.                    


రోడ్డు మార్గం ద్వారా వస్తూంటే ఆయనను అడ్డుకునే  ప్రయత్నం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆయనను అదుపులోకి తీసుకుని తామే స్వయంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో వదిలి పెట్టారు. చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిన రోజున మీడియాతో మాట్లాడి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేబినెట్  భేటీలో ఆమోదించి.. చట్టబద్దంగా ఖర్చు పెట్టిన ఓ వ్యవహారంలో ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేశారని.. తాము వచ్చాక ఎలా వదిలి పెడతామని ప్రశ్నించారు.  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వారం రోజులకు వాయిదా పడటం.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయకపోవడంతో.. ఆయన జైల్లోనే ఉండనున్నారు. దీంతో ఆయనకు సంఘిభావం ప్రకటించేందుకు జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.                        


ఇటీవలి కాలంలో రాజకీయంగా రెండు పార్టీల మధ్య అనుబంధం మరింత పెరిగింది. వైఎస్ఆర్‌సీపీ అరాచకాలపై, అక్రమాలపై గట్టిగా కలసి పోరాడతామని ప్రకటించారు. లోకేష్‌కు ఫోన్ చేసి ముందుగానే సంఘిభావం తెలిపారు. అదే సమయంలో.. లోకేష్ కూడా పవన్ కల్యాణ్ కూడా అన్నలాగా అండగా ఉన్నారని.. తాను ఒంటరి వాడిని కాదని చెప్పారు. ఈ పరిణామాలన్నింటితో టీడీపీజనసేన మధ్య బంధం మరింత ధృడపరిచేలా చేసిందని అంటున్నారు. నిజానికి ఈ రెండు పార్టీలు ఇంకా సీట్ల సర్దుబాటు చేసుకోలేదు. అధికారికంగా పొత్తులు ప్రకటించలేదు. అయినప్పటికీ రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి.                                                     

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.