Andhra Pradesh News - రోజా చుట్టూ బిగుస్తున్న క్రీడల ఉచ్చు! అరెస్ట్ చేసే ఛాన్స్
నాటి నటి.. నిన్నటి ఎమ్మెల్యే.. నేడు మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఆడుదాం ఆంధ్రా క్రీడలు ఉచ్చు బిగిస్తుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. అసలు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఆమెపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు కమ్ముకుంటున్నాయి. మాజీమంత్రి రోజా అనగానే గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో అప్పటి ఎమ్మెల్యే, మంత్రీ రోజా మాటలు తూటాలుగా పేలేవి.. ఆమె పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ సహా ఎవరి గురించి మాట్లాడినా సోషల్ మీడియా లో వైరల్ గా మారేది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆంధ్రా క్రికెట్ సంఘం చీఫ్‌గా ఎంపీ కేశినేని చిన్ని - 6 పదవులు ఏకగ్రీవం
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన అధ్యక్షుడిగా టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెల 8న విడుదల కానుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులచేతుల్లోనే ఏసీఏ ఉండేది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరంతా తమ పదవులకు రాజీనామా చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


హరీశ్ రావు ఇంటిపై దాడి, మరి సాధారణ ప్రజల పరిస్థితేంటి - బీఆర్ఎస్
సిద్ధిపేట లోని తన అధికారిక నివాసంపై కాంగ్రెస్  గూండాలు దాడి చేసి, ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూర్చారని  బీఆర్ఎస్  సీనియర్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు.  పోలీసులు వారి చర్యలకు కొమ్ముకాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు ‘జై కాంగ్రెస్’ నినాదాలు చేస్తూ గేటు తోసుకుంటూ లోపలికొచ్చి తన క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీని చించి వేస్తున్నట్లు ఉన్న దృశ్యాలను ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేసిన ఆయన ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై, తెలంగాణ పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం, కుట్రతోనే చేశారా?
ఏపీలో ఈ మధ్య విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరిగి ముఖ్యమైన ఫైల్స్ మాత్రమే కాలిపోయే స్కీమ్ నడుస్తుంది. గడిచిన మూడు నెలల కాలంలో ఏపీ లో జరుగుతున్న ప్రమాదాల పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో అగ్ని ప్రమాదం జరిగితే ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలు, అందులోని వస్తువులు ఇలా ఆస్తి నష్టమో లేదా కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టమో జరిగేది. కాని ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు మాత్రం కేవలం ఫైల్స్ మాత్రమే కాలిపోయి సాక్షం లేకుండా అయ్యేలా ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వరంగల్‌లో ఉప్పలయ్య హోటల్ తెలుసా? కేంద్ర ప్రభుత్వ అవార్డు ఎలా వచ్చింది?
హోటల్ అనగానే ప్రధాన రోడ్డు వెంట భారీ బోర్డులు, రంగురంగుల లైటింగ్ తో కస్టమర్లను ఆకట్టుకోవడం విశ్వ ప్రయత్నం చేస్తారు. అంతే కాదు వినూత్నంగా డైనింగ్ టేబుల్స్, మెనూ కార్డ్ టేబుల్ పైన ఉంటాయి. కానీ ఈ హోటల్లో ఇవేమి కనిపించవు. సాదాసీదా గా ఓ గల్లీలో చిన్న రేకుల ఇంట్లో. ఇంటి బోజనంలా రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న హోటల్ భారత ప్రభుత్వం నుండి అవార్డు అందుకుంది వరంగల్ జిల్లాలోని ఉప్పలయ్య హోటల్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి