Navy Day Celebrations in Visakha: నేవీ డే (Navy Day) సందర్భంగా విశాఖలోని ఆర్కే బీజ్ (RK Beach) లో ఆదివారం భారత నౌకాదళ వాయు విభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. తూర్పు నౌకాదళం కమాండ్ ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు ప్రదర్శించారు. ఇందులో భాగంగా భారత నౌకాదళం ప్రతిభా పాటవాలు, పరాక్రమాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. దాదాపు 8 వేల అడుగుల ఎత్తు నుంచి పారాచూట్ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండాను ఎగురవేసి ఆహుతులను ఆశ్చర్యపరిచారు. నేవీ యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్, జలాంతర్గాములు, హెలికాఫ్టర్లతో సిబ్బంది విన్యాసాలు చేశారు. వీటిని చూసేందుకు ప్రజలు భారీగా తరలిరాగా, ఆర్కే బీచ్ జన సందోహంగా మారింది. నేవీ డే సందర్భంగా ఆర్కే బీచ్ కు వెళ్లే అన్ని మార్గాల్లోనూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 'మిగ్ జాం' తుపాను కారణంగా 10వ తేదీకి నేవీ డే ఉత్సవాలను వాయిదా వేశారు.