గోవా రాష్ట్రానికి ఆమ్‌ఆద్మీ ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అమిత్ పాలేకర్‌ను సీఎం అభ్యర్థిని ఎంపిక చేసినట్లు కేజ్రీవాల్ తెలిపారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశాారు.






అమిత్ పాలేకర్ వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పాలేకర్ భండారీ వర్గానికి చెందినవారు.


గట్టి పోటీ..

 

అరవింద్ కేజ్రీవాల్.. ఇతర రాష్ట్రాల్లో ఆమ్‌ఆద్మీని విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పంజాబ్‌లో ఆప్ ప్రతిపక్షంగా ఉంది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌, గోవా, ఉత్తరాఖండ్‌.. ఇలా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేశారు. ముఖ్యంగా గోవాలో కీలక హామీలు ప్రకటిస్తున్నారు. 

గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే గృహ ఆధార్ ఆదాయాన్ని నెలకు 1,500 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచుతామన్నారు.  


గోవాలో ఇటీవల ఇంటింటి ప్రచారం నిర్వహించారు కేజ్రీవాల్. గోవాలో ఆమ్‌ఆద్మీ పార్టీని గెలిపించాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. 


సింగిల్‌గా కాంగ్రెస్..


మరోవైపు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. సీట్ల పంపకాలపై ఎన్‌సీపీతో చర్చలు చేస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. అయితే మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీతో పొత్తులో ఉన్న కాంగ్రెస్.. గోవా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనుంది. 


Also Read: Goa Election 2022: గోవా ఎన్నికలపై కేజ్రీవాల్ గురి.. ప్రతి మహిళకు నెలకు రూ.1000


Also Read: Goa Elections 2022: గోవా ఎన్నికల బరిలో శివసేన, ఎన్‌సీపీ ఉమ్మడి పోరు.. సింగిల్‌గా కాంగ్రెస్ పోటీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి