Radhika Anant Pre Wedding Events: అనంత్ అంబానీ వివాహాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 1వ తేదీన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. అయితే...మార్చి 1 నుంచి మార్చి 3వ తేదీ వరకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేయనున్నారు. సన్నిహితులతో పాటు పలువురు ప్రముఖులకు ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి ఆహ్వానం పంపింది అంబానీ ఫ్యామిలీ. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ సెలబ్రేషన్స్‌ జరగనున్నాయి. 


"అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ జామ్‌నగర్‌లోని మా ఇంట్లో జరుగుతాయి. ఈ వేడుకలకు అందరూ వచ్చి మా సంతోషకరమైన క్షణాల్లో మీరూ భాగస్వాములవ్వాలని కోరుకుంటున్నాం. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాల్ని పంచుకుందాం"


- అంబానీ ఫ్యామిలీ ఇన్విటేషన్ 


మార్చి 1వ తేదీ..


మార్చి 1వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలతో అతిథులను అలరించనున్నారు. పాటలు, నృత్యాలతో పాటు మరి కొన్ని కళారూపాలు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా ఉంటుందట


మార్చి 2వ తేదీ..


మార్చి 2వ తేదీన Vantara Rescue and Rehabilitation Centre సందర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులందరికీ మరిచిపోలేని అనుభూతి కలుగుతుందని అంబానీ ఫ్యామిలీ చెబుతోంది. ఇదే రోజున భారీ కార్నివాల్‌ కూడా జరగనుంది. 


మార్చి 3వ తేదీ..
 
పచ్చని ప్రకృతిలోనే మధ్యాహ్న భోజనాన్ని ప్లాన్ చేసింది అంబానీ కుటుంబం. రకరకాల రుచికరమైన వంటలు ఈ లంచ్‌లో సర్వ్ చేయనున్నారు. 


14 ఆలయాల నిర్మాణం..


ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కి దాదాపు వెయ్యి మందికి ఆహ్వానం పంపారు. బిల్‌గేట్స్‌, మిలిందా గేట్స్‌తో పాటు మరి కొందరు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. గతేడాది జనవరి 19వ తేదీన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌కి నిశ్చితార్థం జరిగింది. అంబానీ ఫ్యామిలీ ఏకంగా 14 ఆలయాలు నిర్మిస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఈ ఆలయాల్ని నిర్మిస్తున్నారు. భారత దేశ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా వీటిని రూపొందిస్తున్నారు. జులై 12న జరగనున్న పెళ్లికి ఇప్పటి నుంచి ఇలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మార్చి 1వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. మార్చి మూడో తేదీ వరకూ కొనసాగుతాయి. ఎంతో మంది నిపుణులైన శిల్పులు ఇక్కడి ఆలయాలన్ని అందంగా తీర్చి దిద్దారు. స్థానిక హస్త కళాకారులు ఇక్కడి విగ్రహాలను తయారు చేశారు. రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఈ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించారు.భారతీయత ఉట్టిపడేలా ఆలయాల నిర్మాణం చేపట్టాలని ముందుగానే సూచించారు. నిర్మాణం పూర్తైన తరవాత ఆ కాంప్లెక్స్‌ని సందర్శించారు. శిల్పుల కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. అందరి కృషి వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు.


Also Read: జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక మలుపు, హిందువుల పూజలకు లైన్ క్లియర్