Amazon Layoffs:


20 వేల ఉద్యోగాల కోత..
 
టెక్‌ సెక్టార్‌లో లేఆఫ్‌లు కంటిన్యూ అవుతున్నాయి. ట్విటర్‌తో మొదలైన ఈ ట్రెండ్...అన్ని కంపెనీల్లోనూ నడుస్తోంది. అమెజాన్‌లో ఏకంగా 10 వేల మందిని తొలగిస్తున్నట్టు రిపోర్ట్‌లు తెలిపాయి. అమెజాన్ సీఈవో కూడా దీన్ని ధ్రువీకరించారు. అయితే..ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. 10 వేలకు బదులుగా ఏకంగా 20 వేల మందికి ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది. టెక్నాలజీ స్టాఫ్‌, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్‌ సహా మరి కొన్ని విభాగాల్లోని ఉద్యోగులను తొలగించనుంది అమెజాన్. మరి కొద్ది నెలల్లోనూ వీరందరినీ ఇంటికి పంపేయనుంది. గతంలోనే అమెజాన్
సీఈవో యాండీ జాసీ "భారీ లేఆఫ్‌లు" ఉంటాయని వెల్లడించారు. కానీ..ఎంత మందిని తొలగిస్తున్నారన్న విషయం మాత్రం చెప్పలేదు. అప్పటికున్న సమాచారం ప్రకారం 10 వేల మందిని తీసేస్తారని కొన్ని నివేదికలు తెలిపాయి. కానీ..ఇప్పుడా సంఖ్య 20 వేలకు చేరుకుంది. సీనియర్ పొజిషన్‌లో ఉన్న వారినే "ఫైర్" చేయనుంది అమెజాన్. ఉద్యోగులక పనితీరుని సమీక్షించాలని..ఇప్పటికే మేనేజర్లకు 
ఆదేశాలందాయి. ఈ రివ్యూ అయిపోయిన వెంటనే...లేఆఫ్‌లు మొదలు కానున్నాయి. కార్పొరేట్ స్టాఫ్‌లో 6% మందిని తొలగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది వర్క్‌ఫోర్స్ అమెజాన్ సొంతం. కార్పొరేట్ స్టాఫ్‌లో కొంత మందికి ఇప్పటికే "లేఆఫ్‌" కు సంబంధించిన సమాచారం ఇచ్చేశారు. 24 గంటల్లోగా కంపెనీ నుంచి వెళ్లిపోయేలా అన్నీ సిద్ధం చేశారు. రిలీవింగ్ ప్యాకేజ్ అందించి ఇంటికి పంపడమే
మిగిలింది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఉద్యోగులందరిలోనూ టెన్షన్ మొదలైంది. నిజానికి...ఫలానా విభాగంలోనే ఉద్యోగులను తొలగించాలన్న నియమం ఏమీ పెట్టుకోలేదు అమెజాన్. ఎక్కడ వర్క్‌ఫోర్స్ అనవసరం అనుకుంటే...అక్కడ తొలగించుకుంటూ వెళ్లనుంది. 


వాళ్లే వెళ్తున్నారు: అమెజాన్ 


ఈ లేఆఫ్‌లపై వివరణ కోరుతూ..పుణెకు చెందిన ఓ ఉద్యోగ సంఘంతో పాటు, Nascent Information Technology Employees Senate (NITES) కార్మికమంత్రిత్వ శాఖకు పిటిషన్ వేశాయి. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ దీనిపై స్పందించాలని కోరింది. వెంటనే...కార్మిక శాఖ అమెజాన్‌కు నోటీసులు పంపింది. ఈ పిటిషన్‌పై స్పందించిన అమెజాన్ తమ సంస్థ ఎవరినీ తొలగించలేదని వెల్లడించింది. బలవంతంగా ఉద్యోగులను తొలగించారన్న ఆరోపణలను కొట్టి పారేసింది. అమెజాన్ ప్రతినిధి ఈ మేరకు బెంగళూరులోని కార్మిక మంత్రిత్వ శాఖ కమిషనర్‌కు పూర్తి వివరాలు అందించారు. దీనిపై విచారణ జరిగిన సమయంలో పిటిషన్ వేసిన వాళ్లు NITES అక్కడ లేదు. ప్రతి సంవత్సరం ఉద్యోగులను రివ్యూ చేయడం సహజమేనని అమెజాన్ ప్రతినిధి ఆ స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేశారు. వాళ్ల పర్ఫార్‌మెన్స్‌ ఆధారంగా వాళ్ల హోదాలను మార్చడం (Realignment) అనేదీ ఏటా జరిగేదే అని వివరించారు. తాము ఇచ్చిన ప్యాకేజీ నచ్చిన వాళ్లే ఆ మొత్తం తీసుకుని స్వచ్ఛందంగా రాజీనామా చేశారని స్పష్టం చేశారు. అయితే...ఈ రీలైన్‌మెంట్‌ స్కీమ్‌ను అందరిపైనా బలవంతంగా రుద్దలేదని, ఉద్యోగుల ఇష్టప్రకారమే అది జరుగుతుందని తేల్చి చెప్పారు అమెజాన్ ప్రతినిధి. 


Also Read: Watch Video: స్టేజ్‌పై రాహుల్ గాంధీ స్టెప్పులు- అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్‌తో కూడా!