Orissa Cabinet Resign :  బిజూ జనతాదళ్ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ( Naveen Patnaik ) హఠాత్తుగా తన మంత్రివర్గ సభ్యులందరితో రాజీనామాలు చేయించారు. అసెంబ్లీ స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా రాజీనామా చేశారు. పూర్తి మంత్రివర్గాన్ని మార్చే ఉద్దేశంతో నవీన్ పట్నాయక్ ఇలా మంత్రులందరితో రాజీనామాలు తీసుకున్నారని తెలుస్తోంది. వరుసగా గెలుస్తూ వస్తున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం రెండేళ్లలో మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ క్రమంలో కొత్త మంత్రివర్గంతో ఆయన ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆదివారమే కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరుగుతుందని చెబుతున్నారు. స్పీకర్ సూర్యనారాయణ పాత్రోకి మంత్రి పదవి ఇస్తున్నారు.  


ఆ డియోడ్రెంట్ యాడ్‌పై మహిళా సంఘాలు సీరియస్-తొలగించాలంటూ ఐబీ శాఖ ఆదేశాలు


ఇటీవలి కాలంలో నవీన్ పట్నాయక్ ( CM Patnaik ) మంత్రివర్గంలో పలువురు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివాదాల్లో చిక్కుకున్నారు. అదే సమయంలో పలువురు సరిగ్గా పని చేయడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాల పరిధిలో మంచి ఫలితాలు తీసుకు రాని మంంత్రులు ఉన్నారు. వీరందర్నీ తీసి పక్కన పెట్టి కొత్తవారిని తీసుకోవాలనుకుంటున్నారు. అయితే  రాజీనామా తీసుకున్న మంత్రుల్లో కూడా కొందరిని మళ్లీ కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 


యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ రాస్తున్నారా..? ఇవి తప్పనిసరిగా తీసుకెళ్లండి


కొత్త మంత్రివర్గంపై ముందుగానే కసరత్తు చేసిన సీఎం పట్నాయక్.. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలో కూడా డిసైడయ్యారు. కొత్తగా మంత్రి వర్గంలో ( New Cabinet  ) చోటు లభిస్తుందనుకున్న వారందరికీ సీఎంవో నుంచి  ఫోన్లు వెళ్తున్నాయి. ఆదివారం రాజ్ భవన్‌కు  రావాలని వారికి సమాచారం పంపుతున్నారు. ప్రస్తుతం నవీన్ పట్నాయక్ ఐదో సారి సీఎంగా ఉన్నారు. మొత్తం 147 నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీలో బీజేడీకి 113 స్థానాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లోనూ బీజేడీ విజయం సాధించింది. 


చిచ్చు పెట్టిన వంతెన, భాజపా వర్సెస్ తృణమూల్-ఆగని మాటల యుద్ధం


ఒడిషా రాజకీయ చరిత్రలో మంత్రులందరూ రాజీనామా చేయడం ఇదే ప్రథమం. అన్ని జిల్లాలకు కొత్త మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని నవీన్ పట్నాయక్ భావిస్తున్నారు. 2024లోనే ఎన్నికలకు వెళ్లాల్సిన సీఎం జగన్ కూడా ... ఇటీవలే తన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో మార్చేశారు. అందరిచేత రాజీనామా తీుకుని పలువురు కొత్త వారికి అవకాశం ఇచ్చారు.