Airport Security Measures:


కొత్త బ్యాగ్ స్కానర్లు..


ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెకింగ్‌లో కీలక మార్పులు రానున్నాయి. సాధారణంగా...సెక్యూరిటీ చెక్‌ల వద్ద మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ఛార్జర్స్ లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను సెపరేట్‌ ట్రేలో పెట్టి చెకింగ్ చేస్తారు. ఈ విధానంలోనే మార్పు రానుంది. బ్యాగ్‌లో నుంచి తీసి చెకింగ్ చేయడం కాకుండా...వాటిలో ఉండగానే స్కాన్ చేసేలా మార్పులు చేయనున్నారు.  Bureau of Civil Aviation Security (BCAS) ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనుంది. మరో నెల రోజుల్లో ఇది అమలు చేయాలని చూస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. బ్యాగ్స్‌ను స్క్రీనింగ్ చేసేందుకు అధునాతన ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎలక్ట్రానిక్ డివైసెస్‌ని బ్యాగ్‌లో నుంచి తీసే శ్రమ లేకుండానే స్కానింగ్ పూర్తవుతుంది. ఇప్పటికే అమెరికా, యూరప్‌లో ఈ తరహా బ్యాగేజ్ స్కానర్స్‌ను వినియోగిస్తున్నారు. ఇండియాలోనూ దాదాపు అన్ని విమానాశ్ర యాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. "ప్రయాణికులను వీలైనంత త్వరగా చెక్ చేయాలనేదే మా ఉద్దేశం. అందుకే మెరుగైన ఎక్విప్‌మెంట్‌ను తీసుకురానున్నాం" అని అధికారులు వెల్లడించారు. ముందుగా దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో వీటిని ఇన్‌స్టాల్ చేయనున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ల్లోని ఎయిర్‌పోర్ట్‌లో కొత్త బ్యాగేజ్ స్కానర్లు అమర్చుతారు. ఏడాదిలోగా ఈ పని పూర్తవుతుంది. కొద్ది రోజులుగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా అన్ని సంస్థలూ సర్వీస్‌లు అందించలేకపోతున్నాయి. ఈ సమస్యకు తోడు...చెకింగ్ పాయింట్ల వద్ద రద్దీ ఎక్కువవుతోంది. కొన్ని చోట్ల పెనుగులాటలూ జరుగుతున్నాయి. చెకింగ్ పూర్తవడానికి సమయం పడుతోంది. ఫలితంగా...ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చెకింగ్‌లో జాప్యం కారణంగా..కొన్ని ఫ్లైట్‌లు లేట్‌గా నడిచాయి. ఢిల్లీలో తరచూ ఈ సమస్య ఎదురవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే...ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. 


డిసెంబర్ కీలకం..


కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా ఇటీవలే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించారు. టర్మినల్ 3 వద్ద అదనంగా మూడు ఎక్స్‌ రే మెషీన్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. మిగతా ఎయిర్‌పోర్ట్‌లోనూ అదనపు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. "గత 36 గంటలుగా అన్ని ఏజెన్సీలు అప్రమత్తం అయ్యాయి. చెక్‌ పాయింట్ల వద్ద రద్దీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు" అని వెల్లడించారు. కొవిడ్ ఆంక్షల్ని సడలించిన తరవాత భారత్‌లో ఎయిర్ ట్రావెల్‌కు డిమాండ్ పెరిగింది. అయితే...ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ వద్ద చాలా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో...ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులను కనీసం మూడున్నర గంటల ముందు రావాలని కోరుతోంది. అంతకు ముందు రెండు గంటల ముందు వెళ్లే వెసులుబాటు ఉండేది. సాధారణంగా...ఎయిర్ ట్రావెల్‌కు డిసెంబర్ చాలా కీలకమైంది. చాలా మంది న్యూ ఇయర్ వేడుకల కోసం విదేశాలకు వెళ్తుంటారు. కేవలం అంతర్జాతీయ విమానాల్లోనే కాకుండా డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ కూడా ఈ సమయంలో బిజీగా ఉంటాయి. ఇలా రద్దీ ఎక్కువైనప్పుడే తరచూ ఇబ్బందులు తప్పడం లేదు. 


Also Read: China Coronavirus Cases: ఈ వీడియో చూస్తే.. మీ మూతికి మాస్క్ వస్తుంది, చేయి శానిటైజర్ పట్టుకుంటుంది!