China Coronavirus Cases:
కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు ఒంట్లో, భయం భక్తి రెండూ ఉండాలి..
ఈ భయం అంటే ఏంటో.. అది ఎప్పుడు, ఎలా వస్తుందో తెలుసా?
ఎటు చూసినా కరోనా వైరస్ కేసులు, ఆసుపత్రుల నిండా జనాలు..
బయటకు వెళ్లాలంటేనే దడ పుడుతుంది..
అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా?
టీవీ చూస్తే, ఫోన్ ఓపెన్ చేస్తే..
కరోనా కేసులు, వైరస్ వీర విహారం అంటూ.. వచ్చే వార్తలు వింటుంటే..
అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా?
ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఇలానే ఉంది..
అక్కడి ప్రజలు రోజులో ప్రతిక్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉన్నారు. ఈ వీడియో చూస్తే మీ మూతికి మాస్క్ వస్తుంది.. చేయి శానిటైజర్ పట్టుకుంటుంది.
భయానక దృశ్యాలు
చైనాలో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే 90 రోజుల్లో చైనాలోని 60 శాతానికి పైగా ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించిన ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫెఇగ్ల్ -డింగ్ ఈ వీడియో షేర్ చేశారు.
ఈ వీడియోలో వైద్యులు, నర్సులు ఆసుపత్రి ఫ్లోర్‌లో పడుకుని ఉన్నారు. గది నిండా రోగులతో ఆసుపత్రి మొత్తం హౌస్‌ఫుల్‌గా కనిపిస్తోంది. పడకలు సరిపోక.. ఇద్దరు రోగుల మధ్య అసలు గ్యాప్ లేకుండా రూమ్‌లో కిక్కిరిసిపోయినట్లుగా ఉంది. కొంత మంది రోగులు నేలపై నిద్రిస్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రపంచానికి.. ఒకప్పుడు కొవిడ్ చూపించిన బీభత్సం కళ్ల ముందు కదులుతోంది. మరోసారి అదే పరిస్థితి తలెత్తితే ప్రపంచం ఏమైపోతుందనే బెంగ పట్టుకుంది.
3 నెలల్లో
చైనాలో కరోనా నిబంధనలను ఎత్తేసిన తర్వాత పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. పెరుగుతున్న కేసులతో చైనాలోని ఆసుపత్రులు కిటకిటలడుతున్నాయి. వచ్చే 90 రోజుల్లో చైనాలోని 60 శాతానికి పైగా ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫెఇగ్ల్ -డింగ్ అంచనా వేశారు.
ఎరిక్ సోమవారం ట్విట్టర్‌లో ఒమిక్రాన్ వేరియంట్ గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉందని.. అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి 16 మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: Coronavirus: ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్- భారత్‌లో టెన్షన్ టెన్షన్!