ABP Southern Rising Summit: తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితిది విస్మరించలేని పాత్ర . కేసీఆర్ టీఆర్ఎస్ ను స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని అందుకున్నారు. తర్వాత జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వారు అనుకున్న లక్ష్యానికి దూరమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ గట్టి ఎదురుదెబ్బ తగలడంతో పార్టీ పునర్‌నిర్మాణంపై దృష్టిపెట్టారు ఇక భవిష్యత్ లీడర్ గా కేటీఆరే మొదటి నుంచి ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఆయన దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. 


కేటీఆర్ ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాలకు రక్ష అనే వాదనను బలంగా వినిపిస్తూంటారు. తెలుగుదేశం పార్టీని ఆయన ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉదాహరణంగా చూపిస్తున్నారు.. అదే సమయంలో జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి తలపడిన చోట కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నదని.. అదే బీజేపీ ప్రాంతీయ పార్టీలతో తలపడిన చోట ఓడిపోతోదంని  ఇటీవల హర్యానా, కశ్మీర్ ఎన్నికల తర్వాత విశ్లేషించారు. అలా బీజేపీని ఓడించేది ప్రాంతీయ పార్టీలే కానీ.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కాదని ఆయన  తేల్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని అంటున్నారు. 



మరో వైపు దక్షణాది అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఆయన తన వాయిస్ వినిపిస్తూ ఉంటారు. జనాభా తగ్గిపోవడం వల్ల.. రాబోయే రోజుల్లో దక్షిణాదికి తీవ్ర  అన్యాయం జరుగతుందని దాన్ని అన్ని  రాష్ట్రాలు కలిసి అడ్డుకోవాలని ఆయన తరచూ  పిలుపునిస్తున్నారు. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాదికి భారీగా సీట్లు తగ్గిపోతాయని ఆయన వాదన.  అటు ప్రాంతీయ వాదం.. ఇటు జాతీయ వాదం సమపాళ్లలో వినిపిస్తున్న కేటీఆర్ తనదైన రాజకీయంతో ముందుకు సాగుతున్నారు.              


ఈ క్రమంలో తెలంగాణలో ఆయనకు ఎదురు కానున్న సవాళ్లు ఏమిటో చర్చించేందుకు సదరన్ రైజింగ్ సమ్మింట్‌కు కీలక వక్తగా హాజరవుతున్నారు. దేశంలో తెలంగాణ ముద్ర... దక్షిణాది ప్రాముఖ్యత..దేశ రాజకీయాల్లో భవిష్యత్ లో దక్షిణాది ఎలాంటి పాత్ర పోషిస్తుందన్న దానిపై తన అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునేందుకు  ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తున్న "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"కు విశిష్ట అతిథిగా వస్తున్నారు. అక్టోబర్ 25వ తేదీన ఉ.10 గంటల నుంచి ఏబీపీ నెట్ వర్క్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల మీద "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"ను వీక్షించవచ్చు.