Wayanad Lok Sabha Bypoll: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ తన నామినేషన్ ఇవాళ ఫైల్ చేశారు. మంగళవారం రాత్రి తన తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కలిసి వయనాడ్ చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆమె వెంట ఉన్నారు.


నామినేషన్ దాఖలు చేసే ముందు ప్రియాంక గాంధీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వయనాడ్ ప్రజలను తన ఫ్యామిలీ మెంబర్స్‌గా చేసుకునేందుకు తాను వచ్చానంటూ చెప్పుకొచ్చారు. ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రయాణం వాయనాడ్ ఉప ఎన్నిక నుంచి ప్రారంభంకానుంది. 


"ఇది కొత్త ప్రారంభం"
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వయనాడ్ నియోజకవర్గం అభ్యర్థి ప్రియాంక గాంధీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. '35 ఏళ్ల తర్వాత తొలిసారిగా మీ మద్దతు కోరేందుకు వచ్చాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మీకు గుర్తింపు తెచ్చే బాధ్యత నాది. 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి మీ వద్దకు వచ్చాను.ఇది నా కొత్త ప్రారంభం, మీరు నా మార్గదర్శి అని నాకు తెలుసు."
రోడ్ షోకు తరలి వచ్చిన జనం 






వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రియాంక గాంధీ వాద్రా కల్పేటలో రోడ్‌షో నిర్వహించారు. ఇందులో యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ (యుడిఎఫ్) నాయకులు, కార్యకర్తలతో సహా భారీగా జనం తరలివచ్చారు. 






రోడ్‌షోలో ప్రియాంకతోపాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా, సీనియర్ కాంగ్రెస్, ఐయూఎంఎల్ నేతలు ఉన్నారు. ఉదయం నుంచి వేచి ఉన్న యుడిఎఫ్ కార్యకర్తలు, మద్దతుదారులు, సాధారణ ప్రజలు ప్రియాంక, రాహుల్ గాంధీల చిత్రాలు, పార్టీ రంగుల బెలూన్లతో డప్పులు కొడుతూ ఆమెకు స్వాగతం పలికారు.






బీజేపీ తరపున నవ్య హరిదాస్ పోటీ
లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)కి చెందిన సత్యన్ మొకేరి, బిజెపి నుంచి నవ్య హరిదాస్‌పై ప్రియాంక పోటీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల నుంచి గెలుపొందారు. ఆ తర్వాత రాహుల్ వాయనాడ్ స్థానాన్ని వదిలిపెట్టారు. రాహుల్ వాయనాడ్ సీటును వదులుకోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. 






src=hash&ref_src=twsrc%5Etfw">#RahulGandhi #Congress #Wayanad pic.twitter.com/40Jcgk73Ed— ANI Digital (@ani_digital) October 23, 2024