Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే హక్కు ప్రతి మహిళకు ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్‌ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఇదీ కేసు
దేశంలోని అబార్షన్ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. గర్భం ధరించి 20 వారాలు దాటితే అబార్షన్‌కి అనుమతించడం లేదని, ఇందులో మార్పు రావాలని కోరుతూ ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది.
20 వారాల తరువాత అబార్షన్‌కు ప్రస్తుత చట్టాలు అనుమతించకపోవటాన్ని ఆమె ప్రశ్నించారు. ఈ పరిమితి సహేతుకం కాదని, జీవించే హక్కు, సమానత్వ హక్కులకు విరుద్ధమని.. ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని ఆమె కోరారు.
అవాంఛిత గర్భాన్ని, లైంగిక వైధింపుల కారణంగా వచ్చిన గర్భాన్ని మోయటం గౌరవంగా జీవించే హక్కుని, లైంగిక, పునరుత్పత్తి విషయంలో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛని కోల్పోవడమేనని ఆమె అన్నారు.
Also Read: R Venkataramani: తదుపరి అటార్నీ జనరల్‌గా ఆర్ వెంకటరమణి
Also Read: Udhampur Bomb Blast: కశ్మీర్‌లో కలకలం- 8 గంటల్లో రెండు బాంబు పేలుళ్లు!