Udhampur Bomb Blast: జమ్ముకశ్మీర్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉదంపుర్‌లో 8 గంటల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.
రాత్రి
బుధవారం రాత్రి ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న బస్సులో మొదటి పేలుడు జరిగింది. రాత్రి 10.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు పెట్రోల్ బంక్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. పెట్రోల్ కొట్టించుకునేందుకు బస్సు.. ఆ బంకుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
రెండో పేలుడు
ఈ ఘటన జరిగిన 8 గంటల వ్యవధిలో ఉధంపుర్‌లో మరో బస్సులో పేలుడు జరిగింది. ఉదయం ఆరు గంటల సమయంలో బస్టాండ్‌లో ఉన్న ఓ బస్సులో పేలుడు జరిగింది. ఉదంపుర్ నుంచి రామ్‌నగర్‌కు ఈ బస్సు వెళ్లాల్సి ఉండగా పేలుడు సంభవించింది. అయితే, బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది.పేలుడు ధాటికి బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ రెండు ప్రమాదాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హై అలర్ట్
ఈ ఘటనలతో భద్రతా ఏజన్సీలన్నీ అప్రమత్తమయ్యాయి. జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. సైన్యం, పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు జమ్మూ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.. ఏబీపీ న్యూస్‌కు తెలిపారు.
ఉదంపుర్‌లో ఎనిమిది గంటల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు జరగడంతో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ కౌన్సెలర్ ప్రీతి ఖజురియా నేతృత్వంలోని స్థానికులు జమ్మూ పరిపాలన యంత్రాంగానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు.
Also Read: CDS Anil Chauhan: త్రివిధ దళాలకు కొత్త బాస్‌గా అనిల్ చౌహాన్ నియమాకం!