9/11 Attack:


షాక్‌లో నుంచి తేరుకోక ముందే..


2001లో సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై జరిగిన ఉగ్రదాడి...ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన ఘటనగా నిలిచిపోయింది. హింస, ఉగ్రవాదం వల్ల కలిగే నష్టమెంతో మొత్తం ప్రపంచానికి తెలిసొచ్చిన రోజది. ఈ ఏడాదితో ఈ విషాదానికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. న్యూయార్క్‌లోని లోవర్ మన్‌హట్టన్ (Lower Manhattan)లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోకి ఉన్నట్టుండి ఓ విమానం దూసుకొచ్చింది. ఏం జరుగుతోందో తెలిసే లోపే అంతా అయిపోయింది. 110 అంతస్తుల ఈ బిల్డింగ్‌ను ఓ విమానం ఢీ కొట్టిందని అంతా గుర్తించే లోపే...మరో విమానం వచ్చి మరో టవర్‌ను ఢీకొట్టింది. ఫలితంగా...ఆ ట్విన్ టవర్స్ కుప్ప కూలాయి. ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అల్‌కైదా గ్రూప్ లీడర్ ఒసామా బిన్‌లాడెన్ కనుసన్నల్లో జరిగిన  దాడులు.. అంతర్జాతీయంగా అలజడి రేపాయి. మొత్తం 19 మంది ఉగ్రవాదులు కలిసి నాలుగు విమానాలను హైజాక్ చేశారు. ఇందులో రెండు విమానాలు ట్విన్‌ టవర్స్‌ను ఢీకొట్టాయి. ఈ దాడుల్లో మొత్తం 2,977 మంది మృతి చెందారు. దాదాపు పదేళ్ల తరవాత 2011లో మే 2న యూఎస్ నేవీ...అండర్‌ గ్రౌండ్‌లో దాక్కున్న బిన్‌ లాడెన్‌ను వెతికి మరీ హతమార్చింది. 


దాడులు ఎలా జరిగాయి..? 


సెప్టెంబర్ 11, 2001


8.46 am(ET): అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లోని నార్త్ టవర్‌ను ఢీకొట్టింది. 
9.03 am: యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. 
9.37 am: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం పెంటగాన్‌ బిల్డింగ్‌పైకి దూసుకెళ్లింది. 
9.59 am: వరల్డ్‌ ట్రేడ్ సెంటర్ (WTC) సౌత్ టవర్ కుప్పకూలింది. 
10.03 am: యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పెన్సిల్వేనియాలో క్రాష్ అయింది. 
10.28 am: వరల్డ్‌ ట్రేడ్ సెంటర్ (WTC) నార్త్ టవర్ కుప్పకూలింది. 
December 13, 2001: ఈ దాడులకు పాల్పడింది తానేనని ఒసామా బిన్‌ లాడెన్‌ ప్రకటించుకున్నాడు. ఈ ఆడియో టేప్‌ను యూస్ ప్రభుత్వం విడుదల చేసింది.


ఎంత నష్టం జరిగింది..? 


1. ఈ దాడుల కారణంగా ట్విన్ టవ ర్స్ కూలిపోయాయి. 1.8 మిలియన్ టన్నుల శిథిలాలు పోగయ్యాయి. వీటిని తొలగించేందుకు 3.1 million గంటల సమయం పట్టింది. మొత్తం వీటిని క్లీన్ చేసేందుకు పట్టిన ఖర్చెంతో తెలుసా..? 750 మిలియన్ డాలర్లు. 


2. 9/11 అటాక్స్‌ తరవాత అమెరికా  Department of Homeland Securityని ఏర్పాటు చేసింది. ఈ దాడులు చేసేందుకు అల్‌కైదా దాదాపు 5లక్షల డాలర్లు ఖర్చు చేసినట్టు న్యూయార్క్ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. అమెరికాకు ఆర్థిక వ్యవస్థపై 3.3లక్షల కోట్ల డాలర్ల ప్రభావం పడింది. ఈ దాడుల్లో వేలాది మంది మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పరిహారం అందించింది. అయితే...ఓ కండీషన్  పెట్టింది. ఆ ఎయిర్‌లైన్స్‌పై కేసు వేయకూడదన్న నిబంధనకు ఓకే చెప్పారంతా. 


Also Read: Uttar Pradesh: ఇదేం భక్తిరా నాయనా- నాలుక కోసుకొని అమ్మవారికి సమర్పణ!


Also Read: Krishnam Raju: ‘నాయాల్ది, కత్తందుకో జానకి’ - అందుకే, కృష్ణం రాజు రెబల్ స్టార్!