76th Infantry Day: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో అరాచకాలు జరుగుతున్నాయని ఇలా చేస్తే తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజ్‌నాథ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను త్వరలోనే తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు.
మానవ హక్కుల పేరిట పాకిస్థాన్ మొసలి కన్నీరు కారుస్తోంది. కానీ పీఓకేలో మాత్రం అరాచకాలు చేస్తోంది. పీఓకే ప్రజల బాధలు వారినే కాకుండా మమ్మల్ని కూడా బాధిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370ని రద్దు చేశాం. దీని వల్ల జమ్ము కశ్మీర్ ప్రజలపై జరుగుతున్న వివక్ష అంతమైంది. జంట కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. ఈ అభివృద్ధి ప్రస్థానాన్ని జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో ఇప్పుడే ప్రారంభించాం.. మా లక్ష్యమైన గిల్గిట్, బాల్టిస్థాన్‌కు త్వరలోనే చేరుకుంటాం. - రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
శ్రీనగర్‌లో నిర్వహించిన 'శౌర్య దివస్' కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ భూభాగంపై జరిగిన తొలిదాడిని 1947 అక్టోబర్ 27 సైన్యం తిప్పికొట్టింది. దీనిని పురస్కరించుకొని ఆర్మీ 'ఇన్‌ఫాంట్రీ డే'ను జరుపుకొంటుంది.
అమిత్ షా
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్‌తో కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే వరకు పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని చెబుతూనే ఉంది.
" 1990 నుంచి జమ్ముకశ్మీర్‌లో 42వేల మంది ప్రాణాలను ఉగ్రవాదం అనే భూతం బలిగొంది. అలాంటిదానితో ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? అబ్దుల్లాలు, ముఫ్తీలు, నెహ్రూ కుటుంబం.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకుంటూనే ఉంటున్నారు. పైగా కొంతమంది పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని మాకు సూచిస్తున్నారు. అసలు పాక్‌తో ఎందుకు మాట్లాడాలి? ఉగ్రవాదాన్ని ఎందుకు సహించాలి? మేం చర్చలు జరపం.
"
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
సహించేది లేదు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఉగ్రవాదాన్ని ఎట్టపరిస్థితుల్లో ఉపేక్షించలేదని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలోనే కశ్మీర్‌ను శాంతివనంగా తీర్చిదిద్దుతామన్నారు.
కశ్మీర్ ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం కశ్మీర్‌లో శాంతి నెలకొనాలంటే పాక్‌తో చర్చలు జరపాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: Hate Speech Case: హేట్ స్పీచ్ కేసులో ఆజం ఖాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష