Hate Speech Case: విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఆజం ఖాన్‌ను దోషిగా తేల్చింది ఉత్తర్‌ప్రదేశ్ రాంపుర్ కోర్టు.
2019 నాటి విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ సహా మరో ఇద్దరు నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. దీంతో పాటు రూ.2000 జరిమానా విధించింది. ఆజం ఖాన్‌పై అవినీతి, దొంగతనం సహా మొత్తం దాదాపు 90 కేసులు ఉన్నాయి.
చీటింగ్ కేసులో జైలుకెళ్లిన ఆజం ఖాన్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో ఈ ఏడాది మొదట్లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన దాదాపు రెండేళ్లపాటు జైలులో గడిపారు.
ఇదే కేసు
హేట్ స్పీచ్ కేసులో ఆయనకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడటంతో ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. 2019లో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అప్పటి కలెక్టర్ ఆంజనేయకుమార్ సింగ్‌పై ఆజం ఖాన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
జయప్రదపై
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో యూపీ రామ్‌పుర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన సినీనటి జయప్రదపై ఓ బహిరంగ సభలో ఆజం ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
"ఆమెను (జయప్రద) రామ్‌పుర్‌కు నేనే తీసుకువచ్చాను. ఆమె జోలికి ఎవరూ రాకుండా నేను చూసుకున్నాను. అందుకు మీరే సాక్ష్యం. రాంపుర్, ఉత్తర్‌ప్రదేశ్, దేశ ప్రజలకు ఆమె నిజస్వరూపం తెలియడానికి 17 ఏళ్లు పట్టింది. నేను మాత్రం 17 రోజుల్లోనే కనిపెట్టాను......"
-ఆజంఖాన్, ఎస్పీ సీనియర్ నేత
ఆజం ఖాన్ వ్యాఖ్యలపై అప్పట్లో జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
Also Read: Covid Patient in China: క్రేన్ సాయంతో కొవిడ్ రోగుల తరలింపు- చైనాలో షాకింగ్ ఘటన!