Sudheer Babu New Movie Update : ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నించే కథానాయకులలో నిట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) ఒకరు. క్యారెక్టర్‌కు తగ్గట్టు ఆయన తనను తాను మలుచుకునే హీరో ఆయన. అవసరం అయితే సిక్స్ ప్యాక్ చేస్తారు. ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సుధీర్ బాబు ఎప్పుడూ రెడీ. సినిమా సినిమాకు కొత్తదనం చూపించాలని ట్రై చేసే ఆయన... ఈ రోజు కొత్త సినిమా ప్రకటించారు.
'సెహరి' దర్శకుడితో...
సుధీర్ బాబు కథానాయకుడిగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు ఓ సినిమా నిర్మించనున్నారు. దీనికి జ్ఞాన సాగర్ ద్వారక దర్శకుడు. 'సెహరి' చిత్రానికి దర్శకత్వం వహించినది ఆయనే. ఆ సినిమా తర్వాత జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. సుధీర్ బాబుకు 18వ సినిమా (Sudheer Babu's 18th Movie). నేడు ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
అక్టోబర్ 31న మాస్ సంభవం!
సుధీర్ బాబు 18వ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేశారు. అది చూస్తే... ఒక లెటర్, ల్యాండ్ లైన్ ఫోన్, గన్, బుల్లెట్స్, వంద రూపాయల నోటుతో పాటు యాష్ ట్రేలో సిగరెట్ కూడా ఉంది. లెటర్ గమనిస్తే... చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్యాలస్ రోడ్డులో ఉంటున్న శివారెడ్డి కుమారుడు సుబ్రమణ్యానికి సౌత్ బొంబాయిలోని అరుణ్ గౌలి రాసిన లేఖ అది. 'మీ రాక అవసరం. క్రిటికల్' అని పేర్కొన్నారు. అంతే కాదు... 'అక్టోబర్ 31న మాస్ సంభవం' అని పేర్కొన్నారు. అంటే... ఆ రోజు మరో అప్‌డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. లెటర్ మీద గుడి కూడా ఉంది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా!
ఈ సినిమాలో సుధీర్ బాబు ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని మాస్ లుక్‌లో కనిపిస్తారని చిత్ర బృందం తెలియజేసింది. కుప్పం నేపథ్యంలో 1989 కాలంలో సాగే కథతో రూపొందే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది. ఈ కథకు డివైన్ టచ్ కూడా ఇచ్చారట. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
Also Read : 'ఝాన్సీ' వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - సిరీస్ ఎలా ఉందంటే?
స్టైలిష్ యాక్షన్ మూవీగా 'హంట్'!
సుధీర్ బాబు 18వ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామా అయితే... దాని కంటే ముందు 'హంట్'తో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అది స్టైలిష్ యాక్షన్ మూవీ. హై వోల్టేజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.
'హంట్' సినిమాలో సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే... హీరో సుధీర్ బాబు తన గతం మర్చిపోయాడని తెలుస్తుంది. గతం మరువక ముందు అతడు స్టార్ట్ చేసిన కేసు ఏమిటి? దాన్ని మళ్ళీ అతడే క్లోజ్ చేయాలని శ్రీకాంత్ ఎందుకు చెబుతున్నారు? అనేది ఆసక్తిగా మారింది.
అంతర్జాతీయ తీవ్రవాదాన్ని స్పృశిస్తూ... పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు మహేష్ తెలిపారు. కొన్ని యాక్షన్ సీక్వెన్సులను ఫ్రాన్స్‌లో అక్కడి స్టంట్ డైరెక్టర్స్‌తో తీశామని ఆయన పేర్కొన్నారు. సుధీర్ బాబు, శ్రీకాంత్, భారత్, అప్సరా రాణిపై తెరకెక్కించిన స్పెషల్ సాంగ్ 'పైలం పాపతో పైలం... జర పైలం షేపుతో పైలం!' కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.