Corona Cases in India: దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు (Corona Active Cases) 4 వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 628 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ 312 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742 నుంచి 4,054కు పెరిగింది. 


కేరళలోనే అత్యధికం


తాజా కేసుల్లో ఒక్క కేరళలోనే (Kerala) 128 కేసులు వెలుగుచూశాయి. ఆదివారం కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో కొవిడ్ తో మృతి చెందిన వారి సంఖ్య 5,33,334కు చేరింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,128కు చేరినట్లు అధికారులు తెలిపారు. అటు కర్ణాటకలో 73, మహారాష్ట్రలో 50, రాజస్థాన్ లో 11, తమిళనాడులో 9,  తెలంగాణలో 8 కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 315 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 చేరుకుంది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.18 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకూ 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.


థానేలో కొత్త వేరియంట్ కేసులు


మరోవైపు, థానేలో తాజాగా 5 కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 కేసులు నమోదయ్యాయి. నవంబర్ 30 నుంచి 20 నమూనాలు పరీక్షించగా 5 జేఎన్ 1 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం థానేలో యాక్టివ్ కేసుల సంఖ్య 28కి పెరిగింది. వారిలో ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు ఇళ్లల్లో కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ దరించాలని, జనసమూహం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉండొద్దని సూచిస్తున్నారు.


22 జేన్ 1 కేసులు


డిసెంబర్ 21 నాటికి దేశవ్యాప్తంగా 22 JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 21 కేసులు ఒక్క గోవాలోనే, మరో కేసు కేరళలో వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మూడు నెలలకోసారి హాస్పిటల్‌లోని వసతులను రివ్యూ చేసుకోవాలని సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని తెలిపింది. ప్రస్తుతానికి JN.1 Variant ని ప్రపంచ దేశాలు పరిశీలిస్తున్నాయని, మరీ ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైతే కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. JN.1 వేరియంట్‌ని "Variant of Interest" గా ప్రకటించింది. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే... ఓ వేరియంట్‌ ఇమ్యూనిటీ వలయాన్ని దాటుకుని మరీ వ్యాప్తి చెందడం. ఎప్పటికప్పుడు వైరల్ లక్షణాలనూ మార్చేస్తుందీ వేరియంట్. అందుకు తగ్గట్టుగానే వైద్యంలోనూ మార్పులు చేయాల్సి వస్తుంది. వ్యాక్సిన్‌లు కొత్తగా తయారు చేసుకోవాల్సిందే. అయితే...ప్రజల ప్రాణాలకు ప్రమాదం లేనప్పటికీ ఎక్కువ మందికి సోకే లక్షణముంటుంది ఈ వేరియంట్‌కి. నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం..ఈ వైరస్ స్ట్రెయిన్ చాలా సులభంగా రోగ నిరోధక శక్తిని ఛేదించుకోగలదు. అంతే కాదు. అంతే సులభంగా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.


Also Read: Brij Bhushan Retires: రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్