Chocolate Cake Recipe : కేక్ తయారు చేయడానికి ఓవెన్ కావాలి అందుకే మేము దానిని వండుకోలేకపోతున్నామని చాలా మంది అంటుంటారు. అయితే ఓవెన్​ లేకుండా ఇంట్లోనే ప్రెజర్​ కుక్కర్​తో కూడా మీరు అదిరే కేక్​ను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? మీరు క్రిస్మస్ స్పెషల్​గా, న్యూఇయర్​ కోసం ఇంట్లోనే చాక్లెట్​ కేక్​ను ప్రెజర్​ కుక్కర్​తో తయారు చేసుకోవచ్చు. దీనిని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎంత సమయం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.  


కావాల్సిన పదార్థాలు 


పిండి - 1 కప్పు


కోకో పౌడర్ - పావు కప్పు


బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్


వెన్న- 1 పావు కప్పు


పంచదార - ముప్పావు కప్పు


నీరు - పావు కప్పు


గుడ్లు - 2 


వెనిలా ఎసెన్స్ - అర టీస్పూన్


ఉప్పు - చిటికెడు


బేకింగ్ టిన్ - 6 అంగుళాలు ఉండేది బెటర్ 


తయారీ విధానం


ముందుగా మిక్సింగ్ గిన్నె తీసుకోండి దానిలో పిండి, కోకో పౌడర్, బేకింగ్​ పౌడర్​ను జల్లెడ పట్టి కలిపేయండి. వెన్న, పంచదార, ఉప్పు, నీరు, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపండి. అవి బాగా కలిసిన తర్వాత దానిలో గుడ్లను పగులగొట్టి వేయండి. ఒకేసారి కాకుండా.. ముందు ఒక గుడ్డును వేసి.. బాగా కలిపి.. తర్వాత మరొకటి వేయండి. దీనిని బాగా కలిపి పిండి స్మూత్​గా మారేవరకు కలపండి. ఈ మిశ్రమాన్ని బటర్​ పూసిన బేకింగ్​ టిన్​లోకి వేయండి. దాన్ని నేలపై సున్నితంగా టాప్ చేయండి. దీనివల్ల దానిలో ఉండలు, గాలి లేకుండా ఉంటుంది.


ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై ప్రెజర్ కుక్కర్ ఉంచండి. దానిపై కుక్కర్ మూతను ప్రెజర్​ లేకుండా ఉంచండి. దానిని నాలుగైదు నిముషాలు ప్రిహీట్ చేయండి. ఇప్పుడు దానిలో కేక్​ టిన్​ పెట్టండి. కుక్కర్​ నీరు వేయకుండా ఖాళీగా ఉన్న కుక్కర్​లోనే ఉంచాలి. ఇప్పుడు మూతను ప్రెజర్​లేకుండానే పెట్టాలి. మంటను చిన్నగా చేసి.. దానిని అరగంట ఉడికించాలి. అనంతరం ఆపేసి దానిలో టూత్​ పిక్ పెట్టి కేక్ ఉడికిందో లేదో తెలుసుకోవచ్చు. ఉడికితే దానిని బయటకు తీసి.. మీకు నచ్చినట్లుగా గార్నిష్ చేసుకోవచ్చు. 


కుక్కర్​లో కేక్ వండితే ఈ టిప్ ఫాలో అవ్వండి..


ప్రెజర్ కుక్కర్​లో కూడా ఇంత టేస్టీ కేక్ తయారు చేయవచ్చా అని ఇంట్లో వారు, బంధువులు ఆశ్చర్యపోయే విధంగా దీనిని టేస్ట్​ ఉంటుంది. ఇది మీకు స్పెషల్ డేస్​లో, ఫ్యాన్సీ డిజెర్ట్​గా పని చేస్తుంది. అయితే ప్రెజర్​ కుక్కర్​లో కేక్ చేసేప్పుడు కలిగే ప్రధాన సమస్య ఏంటంటే.. కుక్కర్​కి టిన్​ అంటుకుపోతుంది. దీనిని మీరు కొన్ని టిప్​ ఫాలో అవ్వడం వల్ల నివారించవచ్చు. కుక్కర్​ లోపల వెన్న రాయాలి. అలాగే బేకింగ్ టిన్​లకు కూడా వెన్న రాయాలి. లేదంటే మీరు టిన్​ కింద ఉప్పు వేసి ఉంచవచ్చు. ఇది కేక్ టిన్​ కుక్కర్​కు అంటుకోకుండా చేస్తుంది. ఈ టిప్స్​తో మీరు సులభంగా ఇంట్లోనే చాక్లెట్​ కేక్​ రెసిపీని ప్రయత్నించవచ్చు. 


Also Read : ఎగ్​లెస్ రవ్వ కేక్.. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే రెసిపీ