Today Top Headlines In AP And Telangana:


దావోస్‌ వెళ్లిన మోటో వేరు 


దావోస్ నుంచి ఎలాంటి పెట్టుబడులు తీసుకురాకుండానే తిరిగి వచ్చారనే విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. గతంలో హైదరాబాద్‌  ప్రమోట్ చేశామని ఇప్పుడు అమరావతి అనే కొత్త బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నామన్నారు. 27 ఫేస్‌ టూ ఫేస్‌ మీటింగ్స్‌లో పాల్గొన్నట్టు వెల్లడించారు. నాలుగు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు, 3 కాంగ్రెస్ సమావేశాలు, ఒక యూఎన్ హాబిటెట్ సమావేశానికి హాజరైనట్టు పేర్కొన్నారు. మన దగ్గర ఉన్న అనుకూలత, ప్రభుత్వ సహకారం వ్యాపారవేత్తలకు తెలిపామన్నారు. గతంలో ఐటీ గురించి ఇప్పుడు  హ్యూమన్ మెషిన్ కొలాబరేషన్ అన్ లాకింగ్ మీద ఫోకస్ చేసినట్టు ివరించారు. ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.


పొలిటికల్ ఉబ్బరంతో ఈనోకు ఉచిత ప్రచారం 


తెలంగాణ రాజకీయాలతో ఈనోకు ఉచిత ప్రచారం లభిస్తోంది. ఇప్పటి వరకు తమను తాము ప్రచారం  చేసుకున్న ప్రభుత్వాలను చూసే ఉంటారు తొలిసారిగా ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ఇలాంటి ప్రచారం చేయడం మాత్రం ఇదే తొలిసారి. దావోస్‌ కేంద్రంగా జరిగిన ఒప్పందాలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ మధ్య రగులుతున్న రాజకీయంలో ఇదో కొత్త పోకడ చూస్తున్నాం. కేటీఆర్ ఫొటోలతో హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా పోస్టర్లు, హోర్డింగులు రాత్రికి రాత్రి వెలిశాయి. వీటిని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.


హనీ ట్రాప్ ముఠా అరెస్టు 


ఈ మధ్య కాలంలో ఉత్తరాంధ్ర హైటెక్ నేరాలకు కేంద్రంగా మారుతోంది. తాజాగా హనీట్రాప్‌ కేసులో అరెస్టులు సంచలనంగా మారుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన రామారావు అనే వ్యక్తిని హనీ ట్రాప్ చేసి దోపిడీకి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలతో పేరుతో వలవేసి నగదు దోచుకున్న విషయంలో ఆలస్యంగా వెలుగు చూసింది. మాయ మాటలు చెప్పి ఓ చోటుకి రమ్మని దాడి చేసి నిలువుదోపిడీ చేస్తున్నారు. కంచరపాలేనికి చెందిన ఓ వివాహితతో కలిసి ముఠా ఏర్పడిన వీళ్లంతా హనీ ట్రాప్ చేయడం ఆరంభించారు. ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.


మేమంతా క్లీన్‌ అండ్‌ వైట్‌


నాలుగు రోజులుగా సంచలనంగా మారుతున్న ఐటీ రైడ్స్‌పై అగ్ర నిర్మాత 'దిల్' రాజు క్లారిటీ ఇచ్చారు. తమ ఆఫీసులతోపాటు ఇళ్లలో జరిగిన ఐటీ రైట్స్ గురించి మీడియా సమావేశం పెట్టి చాలా విషయాలపై స్పష్టత ఇచ్చారు. తమను ఎవరు టార్గెట్ చేయలేదన్న రాజు... ప్రాసెస్‌లో భాగంగానే ఐటీ రైడ్స్‌ జరిగినట్టు వెల్లడించారు. 18 ఏళ్ల క్రితం ఒకసారి ఐటీ తనిఖీలు జరిగాయని ఇప్పుడు మళ్లీ చేశారని గుర్తు చేశారు.  తామంత క్లీన్‌గా ఉన్నామని ఎలాంటి రైడ్స్ జరిగిన వచ్చిన భయం ఏమీ లేదన్నారు. వారి కావాల్సిన లెక్కలు, ఇతర అనుమానాలపై క్లారిఫై తీసుకున్నారని వివరించారు. మీడియాలో వచ్చినట్టు తమ వద్ద 20 లక్షలకు మించిన నగదు ఇతర డాక్యుమెంట్స్‌ లభించలేదని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.


కూటమికేే మేలు


రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్సార్ సీపీ నేత వి. విజయసాయిరెడ్డి  రాజీనామా చేసి ఆమోదింపజేసుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తో సమావేశమై రాజీనామా సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఏదైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొనే తత్వం తనదని కేసులకో, ఎవరికో భయపడే ఇలాంటివి చేలేదన్నారు. తన రాజీనామాతో కూటమికి మేలు జరుగుతుందని తెలిసనా తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.