నెలసరి వచ్చిందంటే కొంతమంది మహిళలు పొత్తికడుపు నొప్పి అల్లాడిపోతుంటారు. ఆ నొప్పిని తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్లు చాలా మంది. కానీ పెయిన్ కిల్లర్స్ అతిగా వాడడం చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ పెయిన్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని యోగసనాలు సహకరిస్తాయని చెబుతోంది శిల్పాశెట్టి. ఈమె యోగా నిపుణురాలన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు శిల్పాకు ‘సింపుల్ సోల్‌ఫుల్’ ఫిట్నెస్ యాప్ కూడా ఉంది. యాభై ఏళ్లకు దగ్గరపడుతున్నా శిల్పా శెట్టి ఎంత ఫిట్ గా, అందంగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. అందుకు కారణం యోగానే అని చెబుతుంది ఆమె. తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఆమె తన గురించి నటి అని రాసుకోలేదు. ‘మైండ్ ఫుల్ యోగి, వెల్‌నెస్ ఇన్ ఫ్లూయెన్సర్’ అని రాసుకుంది. 


ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు వర్కవుట్ వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా స్త్రీల కోసం ఓ వీడియోను పోస్టు చేసింది. అందులో పీరియడ్స్ సమయంలో పొట్ట నొప్పితో బాధపడే స్త్రీల కోసం కొన్ని యోగసనాలను చేసి చూపించింది. ఆ వీడియోలో చాలా సింపుల్ గా చేసే యోగసనాలే ఉన్నాయి. వాటిని రోజూ చేస్తుంటే నెలసరుల్లో వచ్చే నొప్పులు తగ్గుతాయి. ‘ఏళ్ల తరబడి పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని భరించడం అంత తేలికైన విషయం కాదు. అందులోనూ అనేక బాధ్యతలను మోస్తూ ఈ బాధను భరించడం మరీ కష్టం. కానీ క్రమం తప్పకుండా మీకోసం కొంత సమయాన్ని కేటాయించి యోగా సాధన చేయడం ద్వారా మీరు ఆ నొప్పిని అధిగమించగలరు’ అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ యోగసనాలు పునరుత్పత్తి అవయవాలు, కటి ప్రాంతం, పొత్తకడుపు కండరాలపై ప్రభావవంతంగా పనిచేసి నొప్పిని తగ్గిస్తాయి. 





Also read: జెర్సీ అంటే టీ షర్టు అనుకుంటివా? ఓ జబ్బు పేరు కూడా



Also read: మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు, చికెన్ తింటే ప్రమాదమా, బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుందా?