ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో క్రూయిజ్ ఓడలు మళ్లీ పునరాగమనం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ అయిన రాయల్ కరేబియన్ ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’తో రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. కరేబియన్ ఇంటర్నేషనల్ కు సంబంధించి తొలి ఐకాన్-క్లాస్ షిప్‌గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఓడ పరిమాణంలో 250,800 టన్నుల బరువు ఉంటుందట. ఒయాసిస్ క్లాస్ వండర్ ఆఫ్ ది సీస్ కంటే పెద్దదిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒయాసిస్ షిప్ బరువు 236,857 టన్నులుగా ఉంది. ఈ క్రూయిజ్ షిప్‌ను స్టార్ షిప్‌బిల్డర్ మేయర్ తుర్కు నిర్మిస్తోంది. రాయల్ కరేబియన్‌లోని కొత్త ఐకాన్ క్లాస్‌లో మూడింటిలో ఇదొకటి. త్వరలో జల ప్రదేశం చేసేందుకు రెడీ అవుతోంది.
365 మీటర్లు పొడవు, 7,600 మంది ప్రయాణీకుల సామర్థ్యం
ఇక ఈ క్రూయిజ్ షిప్ ప్రత్యేకతల గురించి తెలుసుకుంటే పర్యావరణ అనుకూల ప్రొపల్షన్ సిస్టమ్స్ ను కలిగి ఉంటుంది. LNG ద్వారా శక్తిని పొందే తొలి కరేబియన్ ఓడగా గుర్తింపు పొందింది. ఫ్యూయెల్ సెల్ సాంకేతికతను కలిగి తొలి నౌక. షిప్-టు-షోర్ కనెక్షన్, హీట్ రికవరీ సిస్టమ్స్ సహా అత్యాధునిక సాంకేతికతతో రూపొందింది. దీని మొత్తం పొడవు 1,198 అడుగులు లేదంటే 365 మీటర్లు ఉంటుంది. ఓడ యొక్క గరిష్ట సామర్థ్యం 7,600 మంది ప్రయాణించే అవకాశం ఉంది. ఈ కొత్త ఓడ నిర్మిణాకికి ఐదు సంవత్సరాల సమయం పట్టింది.
ఎన్నో ప్రత్యేకతలు నిలయం ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’
క్రూయిజ్ షిప్‌లో మొత్తం 20 డెక్‌లు ఉంటాయి. వాటిలో 18 గెస్ట్ డెక్‌లు ఉన్నాయి. 7 స్విమ్మింగ్ పూల్స్. 9 వర్ల్ పూల్స్, 6 రికార్డ్ బ్రేకింగ్ వాటర్‌స్లైడ్‌లు ఉంటాయి. మెగాషిప్‌లో ఐదు కొత్త నైబర్ వుడ్స్ సహా ఎనిమిది నైబర్ హుడ్స్ ను కలిగి ఉంది. ఆక్వాడోమ్, థ్రిల్ ఐలాండ్, చిల్ ఐలాండ్, సర్ఫ్‌సైడ్, ది హైడ్‌వేలను కలిగి ఉంది. ఇందులో 2,805 స్టేటు రూమ్‌లు ఉన్నాయి. బోర్డ్‌లోని అతిపెద్ద సూట్ 1,700-చదరపు అడుగుల్లో అల్టిమేట్ ఫ్యామిలీ టౌన్‌హౌస్ ను కలిగి ఉంది. ఇది 8 మంది ప్రయాణీకులకు వసతి కల్పిస్తుంది. ఇన్-సూట్ స్లయిడ్, సినిమా స్పేస్, కచేరీ, సర్ఫ్ సైడ్ పరిసరానికి ప్రైవేట్ ప్రవేశాన్ని కలిగి ఉంటుంది.
ఈ నౌకలో మొత్తం 2,350 మంది సిబ్బంది ఉంటారు. ఈ నౌకలో సన్‌సెట్ కార్నర్ సూట్‌లు, పనోరమిక్ ఓషన్ వ్యూ క్యాబిన్‌లు ఆక్వాడోమ్‌లున్నాయి. రెస్టారెంట్లు, బార్‌లు, దుకాణాలు, అవుట్ డోర్ సెంట్రల్ పార్క్ గార్డెన్ సహా పలు వసతులు ఉన్నాయి. ఓడ ముందు భాగంలో గ్లాస్ డోమ్‌లో ఆక్వా థియేటర్ కూడా ఉంది.
Also read: దీపావళికి వంటింట్లో వాడే ఈ వస్తువులు మాత్రం కొనకండి, దురదృష్టం వెంటాడుతుందట