Bigg Boss 6 Telugu: దీపావళి రోజు ఎపిసోడ్ అదిరిపోయేలా ప్లాన్ చేశారు బిగ్‌బాస్ టీమ్. సాయంత్ర ఆరు నుంచే మూడు గంటల పాటూ నాన్‌స్టాప్ అలరించేలా చేశారు. ప్రోమోనే అదిరిపోయేలా ఉంది. ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కామెడీ మాత్రం అదిరిపోయింది. 


ప్రోమోలో ఏముందంటే...ఇనయా ‘షోపీస్’ అనే ట్యాగ్‌ను వాసంతి మెడలో వేసింది. నాగార్జున ‘బ్యూటీఫుల్ షోపీస్’ అన్నారు. ఈ లోపు గీతూ అమ్మవారిలా రెడీ అయి ‘ఇనయాలో ఈ మధ్యలో పరగడుపు పువ్వు’ అంది. దానికి రేవంత్ ‘పరగడుపు పువ్వు కాదు, పొద్దు తిరుగుడు పువ్వు’ అని కరెక్టె చేశాడు. హెబ్బా పటేల్, అవికా గోర్, రష్మి డ్యాన్సులతో అదరగొట్టారు. 


గీతూ దొరికిందిగా...
ఇక గీతూ ఈరోజు పండుగ కదా లయర్ , లాయర్ వీడియో వేయండి అడిగింది. అది గతంలో ఆమె బాలాదిత్యను లయర్ అన్న విషయంలో గొడవ జరిగింది. ఆ వీడియోను వేయమంది. వీడియో వేయగానే అందులో లయర్ అనే వినిపించింది. అయినా కూడా గీతూ నేను లాయర్ అనే అన్నాను అంది. చివరికి ‘నేనంతే సర్ గాలికి పోయిన కంపను తెచ్చుకుని నాకు గుచ్చుకుంటా’ అంది. హీరోయిన్ అంజలి అతిధిగా వచ్చింది. ఆమె కోసం రేవంత్ పాట పాడాడు. 


కార్తీ ఎంట్రీ...
సర్దార్ సినిమా ప్రమోషన్లో భాగంగా కార్తీ వేదికపై మెరిశాడు. దీపావళి కాబట్టి స్వీట్లు కూడా తీసుకొచ్చాము అని చెప్పాడు. దానికి ఇనయా ‘స్వీట్లు అందరికీ వచ్చేలా చూడండి’ అంది. అయినా నాగార్జున స్వీట్ల కోసం పోటీ పెట్టారు. ఇందులో ఫైమా చాలా కామెడీగా ఆడి నవ్వించింది. 



చీర కట్టిన రేవంత్
ఇక శ్రీరామచంద్ర కళావతి పాట పాడి అలరించారు. తరువాత మగ కంటెస్టెంట్లంతా అమ్మాయిల్లా రెడీ అయి ర్యాంప్ వాక్ చేశారు. వాళ్లని చూస్తే తెగ నవ్వొస్తుంది ఎవరికైనా. ఇక రేవంత్ నడిచే సమయానికి  శ్రీరామచంద్ర ‘చూడు పిన్నమా’ అనే పాటపాడాడు. కమెడియన్ ఆది కూడా కంటెస్టెంట్లపై పంచ్‌లు వేసి నవ్వించాడు. ప్రతి సీజన్లో ఆది పండుగ రోజు అతిధిగా వస్తూనే ఉన్నాడు. ఆది చేసిన కామెడీ కూడా చాలా నవ్వొచ్చేలా ఉంది. మొత్తమ్మీద ఈరోజు ఎపిసోడ్ అదిరిపోయేలా కనిపిస్తోంది. 


ఇక ఈరోజు అర్జున్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. అర్జున్ ఆడకుండా శ్రీ సత్య చుట్టూ తిరగడమే పెద్ద ప్రభావం చూపినట్టు ప్రేక్షకుల భావన. బిగ్ బాస్ సీజన్ 6లో ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఏడో వ్యక్తిగా అర్జున్ బయటికి వెళ్లబోతున్నాడు. మొదటి వారం ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు. రెండో వారం నుంచి షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి, చలాకీ చంటి, సుదీప ఎలిమినేట్ అయ్యారు. త్వరలో ఆ జాబితాలో అర్జున్ కూడా చేరబోతున్నాడని తెలుస్తోంది.