వీకెండ్ వచ్చేసింది. స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ముందుగా హౌస్ మేట్స్ తో మాట్లాడారు. 'ఏంటి బిగ్‌బాస్ ఈ వారం కొంచెం కోప్పడినట్టు ఉన్నారు' అని అడిగారు. దానికి శ్రీహాన్ సమాధానం చెబుతుండగా మధ్యలో రేవంత్ లేచాడు. వెంటనే నాగ్ 'పప్పు పప్పు నువ్వు కూర్చో' అన్నారు సీరియస్‌గా. ఆ తరువాత శ్రీహాన్ ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు నాగార్జున. హౌస్ లో అన్ డిజెర్వింగ్ ఎవరని నాగార్జున అడగ్గా.. అతడు రోహిత్ పేరు చెప్పారు. టాస్క్ ఆడతాడు కానీ.. యాక్టివ్ గా ఉండడని చెప్పారు. మోస్ట్ డిజెర్వింగ్ ఎవరని అడగ్గా.. గీతూ పేరు చెప్పారు శ్రీహాన్. గేమ్ చాలా బాగా ఆడుతుందని.. తనవల్ల ఎదుటివారి గేమ్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు.
ఆ తరువాత మెరీనాను కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు నాగార్జున. హౌస్ లో అన్ డిజెర్వింగ్ ఎవరని మెరీనాను అడగ్గా.. రాజ్ పేరు చెప్పారు. రాజ్ కి క్లారిటీ లేదని.. ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నారో తనకే అర్ధం కావడం లేదని అన్నారు. మోస్ట్ డిజెర్వింగ్ అంటే సూర్య పేరు చెప్పారు. గీతూని కన్ఫెషన్ రూమ్ కి పిలవగా.. మోస్ట్ అన్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ మెరీనా అని చెప్పారు. డిజెర్వింగ్ కంటెస్టెంట్ శ్రీహాన్ అని చెప్పింది. హౌస్ లో తనకు కాంపిటీషన్ శ్రీహాన్ అనే అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. రేవంత్ ని అవే ప్రశ్నలు అడగ్గా.. అన్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ మెరీనా అని.. డిజెర్వింగ్ కంటెస్టెంట్ శ్రీహాన్ అని చెప్పారు.
రేవంత్ కి నాగార్జున వార్నింగ్:
ఓ గేమ్‌లో రేవంత్ 'నువ్వుండరా పప్పు' అని అర్జున్‌ను అన్నాడు. దానికి అర్జున్ ముందు ఏమీ పట్టించుకోలేదు. కానీ శ్రీసత్య 'నిన్ను ఏమన్నా పట్టించుకోవా, మనిషివి కావా' అంటూ కసురుకుంది. దాంతో అర్జున్ రేవంత్ పై చాలా ఫైర్ అయిపోయాడు. ఇద్దరూ గొడవ పడ్డారు. అదే విషయాన్ని ఈరోజు నాగార్జున ప్రశ్నించారు. శ్రీసత్యను పప్పు విషయంలో తప్పు ఎవరిది? అని అడిగారు నాగార్జున. దానికి శ్రీసత్య 'ఫ్రెండ్స్ నలుగురు ఉన్నప్పుడు ఏమనుకున్నా ఫర్వాలేదు సర్, గేమ్ జరుగుతున్నప్పుడు నువ్వుండరా పప్పు అనడం కొంచెం బాలేదు' అంది. నాగార్జున 'రేవంత్ నువ్వు చేసింది తప్పా, ఒప్పా? చెప్పు పప్పు' అని అడిగారు. దానికి రేవంత్ 'ఇన్ని వారాల్లో లేనిది, అప్పుడు ఎప్పుడు చెప్పనిది, ఇప్పుడు పక్కవాళ్లెవరో చెబితే చెప్పడం' అనగానే అర్జున్ 'లేదు సర్ చాలా సార్లు చెప్పాను అనొద్దని' అని చెప్పారు. 'ఫ్రెండ్స్ తో ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ వాళ్లు హర్ట్ అయినప్పుడు వచ్చి ఎక్స్ ప్రెస్ చేస్తారు. అది మనం అర్ధం చేసుకోవాలి. కోపంలో ఒకరిని పప్పు అని, మరొకరిని పకోడి అని అనడం తప్పు. నువ్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి' అని నాగార్జున.. రేవంత్ కి వార్నింగ్ ఇచ్చారు.
ఫైమాను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన నాగార్జున.. హౌస్ లో అన్ డిజెర్వింగ్ ఎవరని అడగ్గా మెరీనా పేరు చెప్పారు. మోస్ట్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ అంటే రేవంత్ పేరు చెప్పారు. ఫైమా సంచాలకురాలిగా ఎలా చేసిందని నాగార్జున హౌస్ మేట్స్ ని అడిగితే రాజ్ ఏదో చెప్పబోయాడు. దానికి నాగార్జున 'ఇక చాలు' అంటూ రాజ్ లాగే నటించి చూపించారు. ఆ తరువాత శ్రీసత్యను హౌస్ లో అన్ డిజెర్వింగ్ ఎవరని అడగ్గా మెరీనా పేరు చెప్పారు. మోస్ట్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ అంటే శ్రీహాన్ పేరు చెప్పారు. ఆ తరువాత చిట్టీల్లో నీ పేరు వచ్చాక మళ్లీ ఓటింగ్‌కు ఎందుకు వెళ్లావ్ అని అడిగారు శ్రీసత్యని. దానికి 'ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని మీరు తిడతారని మేము ఫిక్సయ్యాం, దానితో పాటూ చిట్టీలాట ఆడామని మీరు తిడతారేమోనని' అని సమాధానం చెప్పింది శ్రీసత్య. దానికి నాగార్జున 'అంతా నా మీద తోసేశారా?' అని ఫన్నీగా అన్నారు.
రోహిత్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన నాగార్జున.. హౌస్ లో అన్ డిజెర్వింగ్ ఎవరని అడగ్గా అర్జున్ పేరు చెప్పారు. మోస్ట్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ అంటే బాలాదిత్య పేరు చెప్పారు. రాజ్ ని హౌస్ లో అన్ డిజెర్వింగ్ ఎవరని అడగ్గా రేవంత్ పేరు చెప్పారు. మోస్ట్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ అంటే శ్రీహాన్ పేరు చెప్పారు. హౌస్ లో అన్ డిజెర్వింగ్ ఎవరని సూర్యని అడగ్గా వసంతి పేరు చెప్పారు. మోస్ట్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ అంటే గీతూ పేరు చెప్పారు. హౌస్ లో అన్ డిజెర్వింగ్ ఎవరని వసంతిని అడగ్గా రాజ్ పేరు చెప్పారు. మోస్ట్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ అంటే సూర్య పేరు చెప్పారు.
హౌస్ లో అన్ డిజెర్వింగ్ ఎవరని బాలాదిత్యను అడగ్గా మెరీనా పేరు చెప్పారు. టాస్క్ లో తను తక్కువ ఆడుతుందని చెప్పారు. మోస్ట్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ అంటే శ్రీహాన్ పేరు చెప్పారు. టాస్క్ లో తన బెస్ట్ ఇస్తాడని.. మాట తీరు కూడా బావుంటుందని చెప్పారు. కీర్తిని మోస్ట్ అన్ డిజెర్వింగ్ ఎవరని నాగార్జున అడగ్గా.. వసంతి అని చెప్పారు. మోస్ట్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ అంటే రేవంత్ పేరు చెప్పారు. తన ఆట తీరు బావుంటుందని.. కానీ మాట తీరు కంట్రోల్ లో ఉండాలని చెప్పుకొచ్చారు.
అర్జున్ కళ్యాణ్ ని మోస్ట్ అన్ డిజెర్వింగ్ ఎవరని నాగార్జున అడగ్గా.. మెరీనా పేరు చెప్పారు. మోస్ట్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ అంటే శ్రీహాన్ పేరు చెప్పారు. ఇనయాను మోస్ట్ అన్ డిజెర్వింగ్ ఎవరని నాగార్జున అడగ్గా.. మెరీనా పేరు చెప్పారు. మోస్ట్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ అంటే శ్రీహాన్ పేరు చెప్పారు. ఆదిరెడ్డిని మోస్ట్ అన్ డిజెర్వింగ్ ఎవరని నాగార్జున అడగ్గా.. అర్జున్ పేరు చెప్పారు. తనకు గేమ్ లో క్లారిటీ లేదని అన్నారు. మోస్ట్ డిజెర్వింగ్ కంటెస్టెంట్ అంటే శ్రీహాన్ పేరు చెప్పారు. డిజెర్వింగ్ లిస్ట్ లో అందరికంటే ఎక్కువ ఓట్లు శ్రీహాన్ కి వచ్చాయి.
అన్ డిజెర్వింగ్ ఓట్లు ఎక్కువ వచ్చిన రాజ్, వసంతి, అర్జున్, మెరీనాలతో మాట్లాడారు నాగార్జున. వారంతా గేమ్ బాగానే ఆడుతున్నామని.. ఎందుకు అన్ డిజెర్వింగ్ అంటున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. అందరికంటే ఎక్కువ ఓట్లు మెరీనాకి రావడంతో ఆమెని గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు నాగార్జున.