ఆయా ప్రాంతాల్లోని పర్యాటక రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందు కోసం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సెప్టెంబర్ 27, 1980లో ఈ వేడుకను యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (UNWTO) తొలిసారి అధికారికంగా నిర్వహించింది. అప్పటి నుంచి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పర్యాటకం అనేది ఉల్లాస భరితంగా ఉండటానికి, చక్కటి విశ్రాంతి తీసుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పర్యటక దినోత్సవం సందర్భంగా పలు దేశాలు తమ పర్యాటక శాఖలు, బోర్డుల ద్వారా తమ నగరాలు, రాష్ట్రాల్లో పర్యటక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. పర్యటక రంగాన్ని మరింత ప్రోత్సహించే నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ ఏడాది ‘టూరిజం రీథింకింగ్’ థీమ్ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవ వేడుకలు జరుగుతాయి.
ప్రపంచ పర్యాటక దినోత్సవ చరిత్ర
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని 1980 నుంచి అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వివిధ ఆతిథ్య దేశాల్లో ఈ వేడుకలు నిర్వహించాలని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచ పర్యాటక దినోత్స ప్రాముఖ్యత
ప్రపంచ పర్యాటక దినోత్సవం అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విలువలను ప్రభావితం చేస్తుంది. పర్యాటకం రంగానికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఉద్దేశించబడింది.
ప్రపంచ పర్యాటక దినోత్స వేడుక
ఈ ఏడాది ఇండోనేషియాలోని బాలిలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. అభివృద్ధిలో పర్యాటం అనేది ఎంతో ముఖ్యమని వివరించేలా ఈ వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నారు.
భారత పర్యాటకం గురించి కొన్ని విశేషాలు
*2021లో ప్రయాణ, పర్యాటక రంగం ద్వారా దేశ GDPకి సుమారు $178 బిలియన్లు అందించబడ్డాయి.
*2017లో 10 మిలియన్లకు పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారు. దాదాపు $27.31 బిలియన్ల విదేశీ మారక ఆదాయాన్ని తీసుకొచ్చింది.
*దేశీయ, విదేశీ పర్యాటకుల కోసం భారతదేశంలో అత్యధికంగా సందర్శించే స్మారక కట్టడాలలో తాజ్ మహల్ మొదటి స్థానంలో ఉంది.
*2017లో పర్యాటకరంగంపై భారత్ సుమారు $186 బిలియన్లు ఖర్చు చేసింది. పర్యాటక రంగంపై సమిష్టి ప్రభుత్వ వ్యయం దాదాపు $2.61 బిలియన్లు.
*2011కుంభమేళాలో దాదాపు 75 మిలియన్ల మంది యాత్రికులు పాల్గొన్నారు. ఈ రద్దీ అంతరిక్షం నుంచి క్లియర్ గా కనిపించింది.
*భారతదేశ ప్రయాణ, పర్యాటక రంగం 2020 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 80 మిలియన్ల మందికి ఉపాధిని కల్పించింది. ఈ రంగం దాదాపు 15.3 శాతం ఉద్యోగాలను కలిగి ఉంది.
*2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని హోటళ్ల ఆక్యుపెన్సీ రేటు 66 శాతంగా ఉంది. ఇది ఇటీవలి సంవత్సరాలలో 34 శాతం కంటే ఎక్కువగా పెరిగింది.