Manhattan | చిన్న భూకంపానికి భవనం ఊగితేనే గుండె దడ దడా కొట్టేసుకుంటుంది. అలాంటిది గాలికి ఊగే భవనంలో నివసిస్తే.. రోజుకోసారి గుండె జారడం గ్యారెంటీ. మరి అలాంటి భవనంలో ఉండటం ఎందుకని అనుకుంటున్నారా? సంపన్నులకు అదే కదా కిక్కు. ఇంతకీ ఈ భవనం ఎక్కుడుందో తెలుసా? 


న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో ఉన్న 84 అంతస్తుల విలాసవంతమైన ఈ అపార్ట్‌మెంట్ ఇప్పుడు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘స్టెయిన్‌వే టవర్’గా పిలిచే ఈ అపార్ట్‌మెంట్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యంగా గుర్తింపు పొందింది. ఒకప్పటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ (1,776 అడుగులు), సెంట్రల్ పార్క్ టవర్ (1,550 అడుగులు) తర్వాత ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యం (1,428 అడుగుల ఎత్తు) ఇదే.


Also Read: ఈ పుచ్చకాయ ధర రూ.4.46 లక్షలు మాత్రమే, దీని ప్రత్యేకత అలాంటిది మరి!


స్టెయిన్‌వే టవర్‌ను ప్రపంచంలోనే అత్యంత బలమైన కాంక్రీటుతో నిర్మించారు. అయితే ఇది అన్ని ఆకాశహర్మ్యాలకు భిన్నమైనది. ఇది గట్టిగా గాలివీస్తే అటూ ఇటూ ఊగుతుంది. ఈ భవన స్ట్రక్చరల్ ఇంజనీర్లు రోవాన్ విలియమ్స్ డేవిస్, ఇర్విన్ మీడియాతో మాట్లాడుతూ సాధారణ గాలులకు కొన్ని అంగుళాల నుంచి 2 అడుగుల వరకు ఊగుతుంది. గంటకు 100-మైళ్ల వేగంతో వీచే గాలులకు ఎక్కువగా ఊగుతుంది. అయితే, ఆ భవనంలో నివసించేవారికి మాత్రం ఆ భవనం గాలికి ఊగుతున్న అనుభూతిని పొందలేరట.


Also Read: దాహానికి, డయాబెటిస్‌కు లింకేమిటీ? నోటిలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!


స్టెయిన్‌వే టవర్‌లోని స్టూడియో అపార్ట్‌మెంట్లు రూ.60 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి. ఈ భవనం ఎగువన ఉన్న ట్రిపుల్ పెంట్ ట్రిపుల్ పెంట్‌హౌస్ ధర $66 మిలియన్లట. అంటే సుమారు రూ.504 కోట్లు. రెసిడెన్షియల్ టవర్లలో మాత్రమే స్టెయిన్‌వే టవర్ అత్యంత సన్నది. యూకేలోని బ్రైటన్‌లోని i360 కోస్టల్ అబ్జర్వేషన్ టవర్ ప్రపంచంలోనే అత్యంత సన్నని టవర్‌.