యాబెటిస్ (Diabetes) లేదా మధుమేహం. చాపకింద నీరులా ఇది ఎప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తుందో తెలీదు. ఇది ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశమే ఉండదు. అయితే, కొన్ని జాగ్రత్తల ద్వారా మన అవయవాలు చెడిపోకుండా ఆయుష్షును పెంచుకోగలం. మీ పరిస్థితి అంతవరకు చేరకూడదంటే.. డయాబెటీస్‌ లక్షణాలను ముందుగానే తెలుసుకోని అప్రమత్తంగా ఉండాలి. 


ఈ వ్యాధి అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె జబ్బులు మరియు నరాల దెబ్బతినే ప్రమాదం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ వ్యాధి నరాలను దెబ్బతీయడమే కాకుండా, రక్తపోటు, స్ట్రోక్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణంకాల ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక మరణాలకు ప్రధాన కారణాల్లో మధుమేహం 9వ స్థానంలో ఉంది. 2019లో 1.5 మిలియన్ల మరణాలు చక్కెర వ్యాధి వల్లే సంభవించినట్లు అంచనా. 


సాధారణంగా.. అతిగా మూత్రం వస్తే డయాబెటీస్ అని భావిస్తారు. అది మాత్రమే కాకుండా కొన్ని సంకేతాలు కూడా ముందుగా కనిపిస్తాయి. ముఖ్యంగా నోటిలో కనిపించే కొన్ని లక్షణాలను మీరు ఎప్పటికీ విస్మరించకూడదు. రక్తంలో అధిక చక్కెర శాతాన్ని మీ నోరు ముందే చెప్పేస్తోంది. మీ నోటిలోని రెండు సాధారణ లక్షణాలు డయాబెటిస్‌ను సూచిస్తాయి. 
 
మీ నోరు తరచుగా పొడిబారుతున్నట్లయితే తప్పకుండా మధుమేహంగా అనుమానించాలి. అలాగే కొందరికి నోటి నుంచి తీయ్యని పండ్ల వాసనతో కూడిన శ్వాస వస్తుంది. ఇది అధిక రక్తపోటు లేదా హైపర్గ్లైకేమియాతో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే గొంతు కూడా పొడిగా ఉండి తరచుగా నీళ్లు తాగాలని అనిపిస్తుంది. ఎన్ని నీళ్లు తాగిన గొంతు మాత్రం పొడిగానే అనిపిస్తుంది. తరచుగా మూత్ర విసర్జన, తీవ్రమైన దాహం వేస్తుంది.


ఈ కింది లక్షణాలు కనిపించినా జాగ్రత్త: 
❂ తీవ్ర అలసట.
❂ చూపు మసకబారడం.
❂ అకస్మాత్తుగా బరువు తగ్గడం. 
❂ గాయాలు త్వరగా నయం కాకపోవడం.
❂ పురుషుల మర్మాంగం చర్మం లోపల తెల్లని పొరలు ఏర్పడి దురద పెట్టడం.


Also Read: వేసవిలో ఏసీ వాడాలంటే వణికిపోతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!


డయాబెటిస్ ఎందుకు ఏర్పడుతుంది?: శరీరంలో ఇన్సులిన్ సమతుల్యత తప్పినప్పుడు మధుమేహం ఏర్పడుతుంది. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహించే ప్యాంక్రియాస్.. తగినంత హార్మోన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా అది ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సరిగ్గా పని చేయనప్పుడు డయాబెటిస్ మొదలవుతుంది.  మధుమేహంలో రెండు రకాలు ఉన్నాయి. టైప్ 2 కంటే టైప్ 1 చాలా తక్కువ మందిలో ఏర్పడుతుంది. టైప్ 1 డయాబెటిస్ సమస్య ఉన్నవారి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేయడానికి బయలుదేరుతాయి. ఫలితంగా, టైప్ 1 డయాబెటిస్‌కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ షాట్లు అవసరమవుతాయి. టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోవడం లేదా కణాలు దానికి సరిగ్గా స్పందించకపోవడం వల్ల సమస్య ఏర్పడుతుంది. టైప్-1కు చికిత్స లేదు. అయితే, తగిన డైట్, బరువు తగ్గడం ద్వారా టైప్-2 నుంచి ఉపశమనం పొందవచ్చు.


Also Read: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారం తినాల్సిందే, కొత్త అధ్యయన ఫలితం