చంద్రబాబుపై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎవరైనా నోరు పారేసుకుంటే చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమని టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందు కోసం తాము వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేసుకున్నామని ప్రకటించారు. చంద్రబాబుపై చెత్త వాగుడు వాగే వారికి ఇదే హెచ్చరిక అని ప్రకటించారు. చంద్రబాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. అనవసంగా నోరు పారేసుకుంటే... టీడీపీ నేతల్ని తిడితే ... టీడీపీ ఆఫీసుపై దాడులు చేస్తే పదవులు వస్తాయని అనుకుంటున్నారనిని మండిపడ్డారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై పిచ్చి వేషాలు వైసీపీ నేతలు మానుకోవాలన్నారు.  సీనియర్లను కాదని జోగి రమేష్‌కు మంత్రి పదవి ఎలా వచ్చిందని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లినందుకే జోగి రమేష్‌కు పదవి వచ్చిందని వైఎస్ఆర్‌సీపీ నేతలే చెబుతున్నారని బుద్దా వెంకన్న గుర్తు చేశారు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 


73వ బర్త్‌డే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం, ఇక స‌మ‌ర‌మే !


బుద్దా వెంకన్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి.  కొంత కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబను, తెలుగుదేశం పార్టీ నేతలను దూషించడమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు ఇంటిపై , పట్టాభిరాం ఇంటిపై , టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కీలక పాత్ర పోషించి వారిని   వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ప్రోత్సహిస్తోందన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఒక్క జోగి రమేష్‌కు మాత్రమే మంత్రి పదవి లభించింది. జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై ఓ సారి దాడికి వెళ్లారు. ఆ విషయం దుమారం రేపింది. మరోసారి అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్‌తో దూషించారు. వీటికి మెచ్చే జగన్ పదవి ఇచ్చారన్న అభిప్రాయం  వైఎస్ఆర్‌సీపీలో వినిపిస్తోంది. 


వైఎస్ఆర్‌సీపీలో పదవుల పండగ - జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల పదవులు వీళ్లకే...


పదవుల కోసం టీడీపీ నేతలపై దాడులు, తిట్ల వర్షం కురిపించే వారి సంఖ్య  వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ పదవుల సందేశంతో ఇంకా టీడీపీ నేతలపై దూషణలు పెరుగుతాయన్న ఆలోచనతో బుద్దా వెంకన్న ఈ హెచ్చరికలు చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే బుద్దా వెంకన్న చెప్పినట్లుగా నిజంగా సూసైడ్  బ్యాచ్‌ను తయారు  చేసి ఉండరని.. ఆయన హెచ్చరికగా అలాంటి మాటలు  చెప్పి ఉంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు.