మాంసాహార మొక్కలు, పువ్వులు ప్రపంచంలో ఉన్న సంగతి తెలిసిందే. కీటకాలు ఈ పూలపై వాలితే చాలు వాటి ప్రాణాలు పొగొట్టుకున్నట్టే. అలాంటి మొక్కల్లో రాఫెల్సియకా ఆర్నాల్డీ ఒకటి. దీన్ని మొక్క అనడానికి లేదు, నేలపైనే పూసే పెద్ద పువ్వు. ఆకుల్లాంటివి కనిపించవు. ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వుల్లో ఇది కూడా ఒకటి. దీన్ని ఆంగ్లంలో ‘Corpse Flower’ అని అంటారు. దానికి కారణం ఇది కుళ్లిన మాంసం వాసన వస్తుంది. ఈ పువ్వు దగ్గరికి వెళితే ముక్కు మూసుకోవాల్సిందే. 


ఇది ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు పుష్పించదు. ఎక్కువగా ఇండోనేషియాలో కనిపిస్తుంది. సుమత్రా, బోర్నియో దీవుల్లో వికసిస్తుంది. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఇండోనేషియా మూడు జాతీయ పుష్పాలలో రాఫ్లేసియా ఆర్నాల్డి ఒకటి. ఇది కనిపిస్తే ఎవరైనా చూస్తూ ఉండిపోతారు. అంత వింతగా, విడ్డూరంగా ఉంటుంది ఈ పువ్వు. ఓ వ్యక్తి ట్రెక్కింగ్ కోసం వెళుతుండగా ఈ పువ్వు కనిపించింది. అతను ఆశ్చర్యంతో వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంకేముంది అది కాస్త వైరల్‌గా మారింది.ఆ వీడియో మీరు కూడా చూడండి. ఆ పువ్వును చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. 




ఈ పువ్వు చాలా అరుదైనది. ఇది కేవలం రెండు రోజులు మాత్రమే వికసిస్తుంది. ఆ సమయంలో కీటకాలను ఆకర్షించేందుకు చాలా కంపు వాసనను వెదజల్లుతోంది. ఆ వాసనకు కీటకాలో పువ్వులోపలి భాగంలోకి చేరగానే కొన్ని రసాయనాలను విడుదల చేసి ఆ కీటకాన్ని కరిగించేసి పోషకాలను పీల్చేసుకుంటుంది. రెండు రోజుల తరువాత ఆ పువ్వు వాడిపోయి రాలిపోతుంది. నేలపై ఉన్న తీగకే ఈ పువ్వు పూస్తుంది కాబట్టి ఆకులు, కాండాల్లాంటివి కనిపించవు. ఒక్కో పువ్వు 11 కిలోల బరువు తూగుతుంది. మూడు అడుగుల వ్యాసంతో పూస్తాయి. ఈ పువ్వుకు ముందు మొగ్గ ఏర్పడ్డాక అది పూర్తిగా వికసించడానికి కొన్ని నెలలు పడుతుంది. ఒకప్పుడు వీటిని ఇండోనేషియా అడవుల్లోనే కనిపించేవి, ఇప్పుడు బొటానికల్ గార్డెన్స్ లో కూడా పెంచుతున్నారు. వీటిని చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు.






Also read: కోపం, ఒత్తిడి ఉన్నప్పుడు తీవ్రమైన వ్యాయామాం చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువా?


Also read: గుండె సమస్య ఉందో లేదో తేల్చేసే ముఖ్యమైన టెస్టులు ఇవే