ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తినాలి. అనారోగ్యానికి గురికావాలంటే.. మీరు తింటున్న ఆహారంపై అవగాహన ఉండాలి. ఎందుకంటే, మీరు ఎంతో ఇష్టపడి తినే ఆహారమే ఒక్కోసారి విషం కావచ్చు. అది అనేక వ్యాధులకు సైతం కారణం కావచ్చు. చివరికి మీ ప్రాణాలను కూడా హరించవచ్చు. భయపెడుతున్నాం అనుకోవద్దు. మీకు అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే, ఏటా జూన్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) నిర్వహిస్తోంది.
World Food Safety Day ఎందుకు?: ఆహార పదార్థాల ద్వారా వచ్చే ప్రమాదాలను నివారించేందుకు, వాటిని ముందుగానే గుర్తించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ World Food Safety Day పాటిస్తోంది. WHO నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా ప్రతి పది మందిలో ఒకరు ఆహార సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. సురక్షితమైన ఆహారం మంచి ఆరోగ్యానికి చిహ్నం. కానీ, అసురక్షిత ఆహారం అనేక వ్యాధులకు కారణమవుతుంది. తినే ఆహారం సరైనది కాకపోతే పిల్లల్లో ఎదుగుదల, పోషకాల సమస్యలు ఏర్పడతాయి. నాన్-కమ్యూనికేబుల్ లేదా కమ్యూనికేబుల్ వ్యాధులు ఏర్పడతాయి. కొందరిలో మానసిక అనారోగ్యం, ఇతరాత్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆహారం ద్వారా వచ్చే వ్యాధులను మనం అంచనా వేయలేం. బయటకు సుచిగా, నోటికి రుచిగా అనిపించినా.. కంటికి కనిపించని విషపూరిత పదార్థాలు ఉంటాయి. అయితే, ఈ రోజుల్లో ఫుడ్ సేఫ్టీ అనేది పెద్ద సవాల్‌గా మారింది. ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగం వరకు - ప్రతి దశలో ఆహారం సురక్షితంగా ఉండాలి. ఏ దశలో నిర్లక్ష్యం వహించినా.. ప్రజలకే ప్రమాదం.
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2022 థీమ్ ఇదే: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్చిలోనే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం థీమ్‌ను ప్రకటించింది. ‘సురక్షిత ఆహారం, మెరుగైన’ ఆరోగ్యం నినాదంతో ఈ రోజును పాటించనున్నారు.
ఎలా పుట్టింది?: ప్రపంచంలో ‘ఫుడ్ సేఫ్టీ’ ప్రమాదంలో ఉంది. ఈ పరిస్థితిని అలా చూస్తూ వదిలేస్తే.. భవిష్యత్తులో మరింత ముప్పును ఎదుర్కోవాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఐక్యరాజ్యసమితి 2018లో ప్రపంచవ్యాప్తంగా World Food Safety Day పాటించాలని ప్రకటించింది. దీంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO)తో కలిసి ప్రపంచ దేశాలతో కలిసి ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీపై ప్రజలకు, సంస్థలకు అవగాహన కల్పించడం, అపరిశుభ్ర, కలుషిత ఆహారం వల్ల సంక్రమించే వ్యాధుల నివారణ, సురక్షిత ఆహారంపై తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టనున్నారు.
Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు