World Diabetes Day 2024 Prevention Tips : మధుమేహంపై అవగాహన కల్పిస్తూ.. ఏటా నవంబర్ 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే ఈ సమస్యపై అందరూ అవగాహన కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇండియాలో కూడా డయాబెటిస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. 2023లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం 10.1 కోట్ల మందికి మధుమేహం ఉందని తేలింది.
అందుకే ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు ఏటా ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనిద్వారా డయాబెటిస్‌పై పూర్తి అవగాహన కల్పిస్తారు. అసలు మధుమేహ నివారణ ఎలా చేయాలి? రోగనిర్ధారణ, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకువాలి? రాకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి.. మధుమేహాన్ని ట్రిగర్ చేసే అంశాలేంటి.. ప్రపంచ మధుమేహ దినోత్సవం థీమ్ ఏంటి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.
ఈ ఏడాది థీమ్ ఇదే..
మధుమేహ నివారణ కోసం.. ప్రతి సంవత్సరం ప్రపంచ మధుమేహ దినోత్సవం రోజు ఓ థీమ్‌ని ఫాలో అవుతూ ఉంటారు. అలాగే 2024కు గానూ.. బ్రేకింగ్ బారియర్స్, బ్రిడ్జింగ్ గ్యాప్స్ అనే థీమ్‌తో వచ్చారు. దీనిలో భాగంగా మధుమేహ సంరక్షణలో అసమానతలను పరిష్కరించడానికి.. ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు సహకారం అందించడమే లక్ష్యంగా ముందుకు రావాలనేది దీని ఉద్దేశం. ఈ థీమ్ వల్ల డయాబెటిస్ ప్రమాద కారకాలు తగ్గించడమే కాకుండా.. సమస్యతో ఇబ్బంది పడేవారికి మద్ధతు అందించాలని సూచిస్తుంది.
మధుమేహం..
ప్యాంక్రియాస్ ద్వారా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోతే.. లేదా ఇన్సులిన్ ఉత్పత్తిని సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవడాన్నే మధుమేహం అంటారు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ అవసరం. సరైన ఇన్సులిన్ పనితీరు లేకుంటే రక్తంలో చక్కెర అదుపు లేకుండా పెరిగిపోతుంది. దీనినే హైపర్ గ్లైసీమియా అంటారు.
మధుమేహ లక్షణాలు
మధుమేహం శరీర వ్యవస్థలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా నరాలు, రక్తనాళాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉంటే.. దానిని గుర్తించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాహం పెరగడం, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం, దృష్టి లోపాలు, అలసట, రీజన్ లేకుండా బరువు తగ్గడం వంటివి మధుమేహం లక్షణాలే.
చికిత్స తీసుకోకుంటే..
మధుమేహం ఉందని తెలిసిన వెంటనే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే.. ఇది గుండె, కళ్లు, మూత్రపిండాలు, నరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అవయవాలలో రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల గుండెపోటులు, స్ట్రోకులు, కిడ్నీల వైఫల్యం వంటి ప్రమాదాలు సంభవిస్తాయి. రెటీన్ రక్తనాళాలు దెబ్బతిని శాశ్వతంగా కంటిచూపును కోల్పోవాల్సి వస్తుంది. నరాలు దెబ్బతిని.. పాదాలలో రక్త ప్రసరణ తగ్గుతుంది. అల్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
ఎవరికి వచ్చే ప్రమాదముందంటే..
టైప్ 1 డయాబెటిస్.. జెనిటిక్స్, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి, పెరిగే వాతావరణ వల్ల వస్తుంది. మధుమేహాన్ని కొన్ని కారకాలు ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా ఫ్యామిలీలో మధుమేహం ఉంటే.. మిగిలినవారికి వచ్చే ప్రమాదం ఎక్కువ. ఒబెసిటీ, శారీరక శ్రమ లేకపోవడం, అన్ హెల్తీ డైట్ ఫాలో అవ్వడం, వారసత్వం, వయసు 45 దాటినవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశముంది.
ఎలా నివారించాలంటే..
టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడానికి లేదా దూరం చేసుకోవడానికి హెల్తీ లైఫ్ స్టైల్‌ను ఫాలో అవ్వాలి. మందులు, వైద్యుల సూచనలతో పాటు ఆరోగ్యకరమైన బరువు ఉండడం.. ప్రతిరోజూ అరగటం వ్యాయామం చేయడం, శారీరకంగా చురుకుగా ఉండడం చేయాలి. స్వీట్స్, అన్ హెల్తీ ఫ్యాట్స్‌కి దూరంగా ఉండాలి. స్మోకింగ్ పూర్తిగా మానేయాలి. డ్రింకింగ్‌కి దూరంగా ఉండాలి. హెల్తీ డైట్ తీసుకోవాలి. వీటిని ఫాలో అవ్వడం వల్ల టైప్ 2 డయాబెటిస్ దూరమవుతుంది.
Also Read : పరగడుపునే ఈ కషాయం తాగితే చాలా మంచిదట.. షుగర్, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతాయట