Healthy Drink : ఉదయాన్నే పసుపుతో కషాయాన్ని(Turmeric Drink) చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. శారీరక ప్రయోజనాలే కాకుండా.. మానసికంగా కూడా బెనిఫిట్స్ సొంతమవుతాయంటున్నారు. అలాగే స్కిన్, హెయిర్‌కి కూడా మంచిదని చెప్తున్నారు. పైగా దీనిని తయారు చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదట. చాలా సింపుల్‌గా ఇంట్లో దీనిని చేసుకోవచ్చు. మరి ఈ కషాయం వల్ల కలిగే లాభాలు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎలా ప్రిపేర్ చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శారీరక ప్రయోజనాలు..
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్లనొప్పులు, శరీరంలో మంట, వాపును దూరం చేస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. సీజనల్ వ్యాధులు రాకుండా.. ఫ్లూ ఇన్ఫెక్షన్లను దగ్గరకు రాకుండా చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. లివర్, కిడ్నీ సమస్యలను దూరం చేసి హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మధుమేహమున్నవారు తీసుకోవచ్చా?
దీనిని మధుమేహమున్నవారు కూడా తీసుకోవచ్చు. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసి.. అదుపులో ఉంచుతుంది. కాబట్టి ఈ డ్రింక్ మధుమేహమున్నవారు కూడా హాయిగా తీసుకోవచ్చు.
అందానికై..
ఈ డ్రింక్‌ని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే.. చర్మానికి, జుట్టుకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది స్కిన్‌కి మంచి గ్లోని ఇస్తుంది. పింపుల్స్‌ని తగ్గిస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు కూడా దీనిని రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తుంది. హెల్తీ హెయిర్ మీ సొంతమవుతుంది.
మానసిక ప్రయోజనాలు..
ఈ కషాయం వల్ల మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒత్తిడి, యాంగ్జైటీ ఉన్నవారు ఈ డ్రింక్ రెగ్యూలర్‌గా తీసుకుంటే.. మంచి ఫలితాలుంటాయి. మీ మూడ్ ఎన్హాన్స్ అవుతుంది. ఒత్తిడినుంచి దూరం చేసి.. కంగారు తగ్గిస్తుంది. దీనివల్ల పనిపై ఫోకస్ పెరుగుతుంది. డే అంతా యాక్టివ్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.
ఎలా తయారు చేయాలంటే..
పసుపు కొమ్మును నీటిలో వేసి మరిగించి.. దానిని వడకట్టి తాగాలి. దానిలో నిమ్మరసం, తేనె లేదా అల్లం కూడా వేసుకుని తాగవచ్చు. ఇవి ఆప్షనల్ మాత్రమే. పసుపు కొమ్ము అందుబాటులో లేకుంటే.. ఓ గ్లాసు నీటిని వేడి చేయాలి. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో టీస్పూన్ పసుపు వేసుకుని తాగాలి. ఈ డ్రింక్‌ని రెగ్యూలర్‌గా తాగితే మంచి ప్రయోజనాలుంటాయి. బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి అరగంట ముందు దీనిని తాగితే మరీ మంచిది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ డ్రింక్‌ని మీరు తాగాలనుకుంటే.. కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి. అలాగే మొదటిసారి ఈ డ్రింక్ ప్రారంభించేప్పుడు పసుపును తక్కువ మోతాదులో శరీరానికి అలవాటు చేయాలి. అంటే మరీ 1 టీస్పూన్ కాకుండా పావు టీస్పూన్, అర టీస్పూన్ అలా పెంచుకోవాలి. టీస్పూన్ పరిమితి చాలు. ప్రెగ్నెన్సీ ఉన్నవారు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. దీని రుచి పెంచుకోవడానికి అల్లం, దాల్చిన చెక్క వంటివాటిని కూడా వేసి తయారు చేసుకోవచ్చు. ఇదే కాకుండా హెల్తీ రోటీన్‌ను ఫాలో అయితే మరిన్ని మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
Also Read : ఈ డైట్ ఫాలో అయితే మధుమేహానికి మందులు ఉపయోగించాల్సిన అవసరం లేదట.. న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలివే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.