ర్భంతో ఉండగానే.. మళ్లీ గర్భం వచ్చే అవకాశం ఉంటుందా? ఔను, అది సాధ్యమే అంటున్నారు వైద్యులు. ఇందుకు అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. కార్లోటే అనే మహిళ ఇటీవల తన జీవితంలో చోటుచేసుకున్న విచిత్ర ఘటన గురించి ‘టిక్ టాక్’లో తెలిపింది. 


తాను మొదటిసారి గర్భం దాల్చినప్పుడు కవల పిల్లలు అని వైద్యులు చెప్పారని తెలిపింది. 10 రోజుల తర్వాత అల్ట్రా సౌండ్ టెస్టుకు వెళ్ళిన ఆమెకు వైద్యులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆమె మరోసారి గర్భం దాల్చిందని పేర్కోవడంతో ఆశ్చర్యపోయింది. పది రోజుల వ్యవధిలోనే మరో బిడ్డ ఎలా సాధ్యమని వైద్యులను అడిగింది.


మొదటిసారి పరీక్షలకు వెళ్లినప్పుడు ఆమె కడుపులో కవలలు మాత్రమే కనిపించారని, పది రోజుల తర్వాత జరిపిన పరీక్షల్లో ఆమె కడుపులో మరో పిండం కనిపించిందని వైద్యులు చెప్పారు. అయినా సరే.. కార్లోటే, ఆమె భర్త ఈ విషయాన్ని అస్సలు నమ్మలేదు. పది రోజుల వ్యవధిలో మరో బిడ్డ ఎలా సాధ్యమంటూ షాక్‌లోనే ఉన్నారు. నెలలు నిండిన తర్వాత ఆమె ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. వారికి ఐవీ, జార్జినా, వివియన్నే అనే పేర్లు పెట్టింది. 


Also read: ఏం ఫుడ్ కాంబినేషన్ గురూ ఇది... విచిత్రం కాదు, వికారం కలుగుతోంది


యూకేలో సౌత్ యార్క్‌షైర్‌లోని షెఫీల్డ్‌కు చెందిన ఓ మహిళ కూడా ఈ విధంగానే ముగ్గురికి జన్మనిచ్చింది. అయితే, ఆమె ఏడాదిలోపే గర్భం దాల్చి ఆశ్చర్యపరిచింది. ఆమె 2020 మే నెలలో రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె పుట్టిన 11 నెలల తర్వాత ఏప్రిల్ నెలలో మరో ముగ్గురికి జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది. కేవలం ఏడాది వ్యవధిలోనే ఆమె నలుగురికి జన్మనిచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 




 

 










ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.