Omicron Cases in Kerala: కేరళలో హై అలర్ట్.. ఒకేసారి 44 ఒమిక్రాన్ కేసులు.. సిక్కింలో ఆంక్షలు

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 31 Dec 2021 07:37 PM (IST)

కేరళలో ఒక్కరోజే 44 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 107కు చేరింది.

కేరళలో హై అలర్ట్

NEXT PREV

కేరళలో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరిగాయి. కొత్తగా 44 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 107కు చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.

Continues below advertisement












కరోనా పాజిటివ్ వచ్చిన చాలా శాంపిళ్లను జినోమిక్ సీక్వెన్సింగ్‌కు పంపాం. సెంటినెల్ సర్వేలెన్స్ జరుగుతోంది. రాష్ట్రంలో అర్హత ఉన్న 98 శాతం మందికి కరోనా మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది. 79 శాతం మందికి రెండో డోసు టీకా వేశాం.                                   - వీణా జార్జ్, కేరళ ఆరోగ్య మంత్రి

 

కరోనా కేసులు..






కేరళలో కొత్తగా 2,676 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. 2,742 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 19,416కు చేరగా మరణాల సంఖ్య 47,794కు పెరిగింది.


సిక్కింలో ఆంక్షలు..



ఒమిక్రాన్ భయాల కారణంగా సిక్కింలో 2022 జనవరి 10 వరకు ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పబ్‌లు, డిస్కోలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, జిమ్‌లు, బార్బర్ షాపులు, సెలూన్లు వంటి వాటిని 50 శాతం సామర్థ్యంతోనే నడపాలని ఆదేశించింది.


సామాజిక, రాజకీయ సభలకు కచ్చితంగా జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేసింది. ఈ సభలను కూడా 50 శాతం సామర్థ్యంతోనే నిర్వహించాలని పేర్కొంది.

Published at: 31 Dec 2021 07:37 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.