Patna | ఫోన్‌కు మనుషులు బానిసలైపోయారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు లోకాన్ని మరిచిపోతున్నారు. అయితే ఆటలు.. లేకపోతే మాటలు. ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్నారు. చూస్తే చూశారు పాడు ఫోను, కనీసం ఎక్కడున్నాం? ఏం చేస్తున్నామనే స్పృహైనా ఉండాలి. ఫోన్‌లో పడి మైమరిచిపోతే ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ వైరల్ వీడియోను చూడాల్సిందే. 


బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిళ రోడ్డు మీద నడుస్తూ ఫోన్ మాట్లాడుతోంది. దీంతో పరిసరాలను మరిచిపోయింది. చివరికి మూత తెరిచి ఉన్న మ్యాన్ హోల్‌ను కూడా గమనించలేదు. ఇంకేముంది.. రెప్పపాటులో ఆమె నేరుగా మ్యాన్ హోల్‌లో పడిపోయింది. లక్కీగా చుట్టుపక్కల ఉన్న జనం ఆ ప్రమాదాన్ని గుర్తించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆమె పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడమే కష్టం.


జనాలంతా గుమిగూడి ఆ మహిళను వెంటనే ఆ మ్యాన్ హోల్‌ నుంచి బయటకు లాగారు. స్వల్ప గాయాలతో ఆమె తప్పించుకుంది. తెరిచివున్న మ్యాన్ హోల్‌లో పడితే దెబ్బలు తగలడమే కాదు, ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అందులో విడుదలయ్యే విషవాయువులను పీల్చితే మనిషి వెంటనే చనిపోతాడు. అందుకే, ఇకపై మీరు రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడకండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడటం కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి.. ఫోన్ కేవలం ఇంట్లో ఉన్నప్పుడే ఒక చోటు బుద్ధిగా కూర్చొని మాట్లాడుకోండి. ఆమెలా రోడ్డు మీద నడుస్తూ ఫోన్ మాట్లాడితే ప్రమాదంలో పడతారు. 


ఈ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఉత్కర్ష్ సింగ్ అనే వ్యక్తి ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్‌‌గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూసి ఇకపై జాగ్రత్తగా ఉండండి. 


వీడియో:






ఇటీవల హర్యానాలోని రోహ్తక్‌లో కూడా ఓ మహిళ ఇలాగే చేసింది. ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఆ పట్టాల మీదకు రైలు వచ్చింది. అయితే, ఆమె వేగంగా పక్కకి తప్పుకోడానికి బదులు పట్టాల మధ్యలో పడుకుంది. ఆమె మీద నుంచి రైలు వెళ్తున్నా.. ఏ మాత్రం బెదరకుండా ఫోన్ మాట్లాడింది. కొంచెం తేడా వచ్చినా ఆమె చనిపోయేది. అయితే, ఆమె మాత్రం తన ప్రాణం కంటే ఫోన్లో మాట్లాడటమే ముఖ్యమైనది అన్నట్లుగా కనిపించింది. ఈ వైరల్ వీడియో చూసిన నెటిజనులు ఆ మహిళను తిట్టి పోస్తున్నారు. అలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలు పోతాయని అంటున్నారు. 


వీడియో: 






Also Read: అలా ఎలా? మలద్వారంలోకి చొచ్చుకెళ్లిన 2 కేజీల డంబెల్, ఇదేం పాడు అలవాటు భయ్యా!


Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి