అమెరికాలోని ఇల్లినాయిస్‌ జరిగిన రోడ్డు ప్రమాదంలో ( US Road Accident ) ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా ముగ్గురు మృతి ( Two Telugu students Died ) చెందారు. ఇల్లినాయస్ వారే టౌన్‌ నుంచి ఈస్ట్‌ కేప్‌కు వేగంగా వెళుతున్న ఫియట్‌ కారు ( Fiat Car ) అదుపుతప్పి సెంటర్‌ లైన్‌ దాటి పక్కరోడ్డుపైకి దూసుకువెళ్లి ఆ రోడ్డుపై వస్తున్న టయోటా కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫియట్‌ కారు నడుపుతున్న డ్రైవర్‌ మారీ మ్యూనియర్‌ తోపాటు అందులో ప్రయాణిస్తున్న వంశీ పెచ్చెట్టి  ( Vamsi ) , టయోటా కారు నడుపుతున్న పవన్‌ స్వర్ణ ( Pavan Swarna ) అక్కడికక్కడే మృతి చెందారు.





పోలీసులు భద్రత కల్పించడంలేదు, నాకేదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? : వివేకా డ్రైవర్ దస్తగిరి


టయోటా కారులో ప్రయాణిస్తున్న యశ్వంత్‌ ఉప్పలపాటి ( Yaswant Uppalapati ) , కాకుమాను కార్తీక్‌ ( Kakumanu Karteek ) , డోర్న కల్యాణ్‌ల ( Dorna Kalyan ) కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు. వీరి ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థులు కాబండేల్‌ టౌన్‌లోని సదరన్‌ ఇలినాయిస్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చేస్తున్నారు. నలుగురు కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులు చేస్తూండగా.. మరొకరు సివిల్ ఇంజినీరింగ్ కోర్సు చేస్తున్నారు.  ప్రమాద తీవ్రత నేపథ్యంలో.. అక్కడి పోలీసులు రోడ్డుని మూడు గంటల పాటు మూసేశారు.


ఉక్రెయిన్ యుద్ధం, ఢిల్లీ అల్లర్ల వార్తలపై మార్గదర్శకాలు - మీడియా సంస్థలకు కేంద్రం సూచనలు !


ఈ ప్రమాదంపై ఎస్‌ఐయు యూనివర్సిటీ  ( SIU )చాన్సలర్‌ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు కుటుంబసభ్యులను కోల్పోవడం  బాధాకరమన్నారు. గాయపడిన ముగ్గురికి అన్ని రకాలగా సాయం అందించేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు. మంచి  భవిష్యత్ ఉన్న ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో అమెరికాలోని భారతీయ సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. వారి మృతదేహాలను స్వదేశం పంపించేందుకు సాయం చేసేందుకు ఎన్నారైలు సాయం చేస్తున్నారు. మరో వైపు గాయపడిన వారికి అవసరమైన సాయం చేసేందుకు కూడా తెలుగు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.